Last Updated:

Air India Express: రన్నింగ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో మంటలు..

ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అబుదాబి నుంచి భారత్ కు వస్తున్న ఎయిరిండియా విమానం ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

Air India Express: రన్నింగ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో మంటలు..

Air India Express: ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అబుదాబి నుంచి భారత్ కు వస్తున్న ఎయిరిండియా విమానం ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి సురక్షితంగా ల్యాండ్ చేశారు.

శుక్రవారం ఉదయం అబుదాబి నుంచి కాలికట్‌కు ఎయిర్ ఇండియా ( Air India) ఎక్స్‌ప్రెస్(ఐఎక్స్ 348) బయలు దేరింది.

టేకాఫ్ తీసుకుని విమానం 1000 అడుగుల ఎత్తులో ఉండగా ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి మంటలు చెలరేగాయి.

ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని అబుదాబి విమానాశ్రయంలో దిగినట్లు క్షేమంగా ల్యాండ్ చేసినట్టు ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి.

ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 184 మంది ప్రయాణికులు ఉన్నారు.

ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నట్టు ఎయిరిండియా తెలిపింది.

గత నెలలోనూ సాంకేతిక లోపం (Air India Express)

గత నెలలో కూడా ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ కు చెందిన మరో విమానంలోనూ సాంకేతిక సమస్య ఏర్పడింది.

జనవరి 23 న తిరువనంతపురం నుంచి మస్కట్ వెళ్తున్న విమానంలో టేకాఫ్ తీసుకున్న 45 నిమిషాల తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది.

దీంతో వెంటనే విమానం వెనక్కి వచ్చి తిరువనంతపురంలో క్షేమంగా ల్యాండ్ చేశారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/