Hyper Aadi: పవన్ కళ్యాణ్ కౌలు రైతుల కష్టాలు తీర్చడం కోసమే సినిమాలు చేస్తున్నారు.. హైపర్ ఆది
పవన్ కళ్యాణ్ రికార్డులకోసమో, ఆస్తులు కూడబెట్టడం కోసమో సినిమాలు చేయడం లేదని కౌలు రైతుల కష్టాలు తీర్చడం కోసమే సినిమాలు చేస్తున్నారని హైపర్ ఆది అన్నారు.
Hyper Aadi: పవన్ కళ్యాణ్ రికార్డులకోసమో, ఆస్తులు కూడబెట్టడం కోసమో సినిమాలు చేయడం లేదని కౌలు రైతుల కష్టాలు తీర్చడం కోసమే సినిమాలు చేస్తున్నారని హైపర్ ఆది అన్నారు. జనసేన యువగళం సభలో మాట్లాడిన ఆది పవన్ కళ్యాణ్ విమర్శకులపై తనదైన శైలిలో సెటైర్లు వేసారు. పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ ఆస్తి ఈ స్టేజి మీద ఉన్నవాళ్లందరికంటే తక్కువ ఉంటుందని అన్నారు.
పవన్ కు డబ్బుమీద ఆశలేదని అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వంనుంచి వచ్చే ప్రతీ పైసా ప్రజలకే ఖర్చు పెడతాడని అన్నారు. పవన్ ఓడిపోతేనే ప్రజల కష్టాలు గురించి పట్టించుకుంటున్నారని గెలిస్తే కష్టాలు కాంపౌండ్ దాటనివ్వరని అన్నారు.
జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తుకు వస్తాడు.. హైపర్ ఆది
ఏపీలో మంత్రులకు ఎవరికీ శాఖల మీద అవగాహన లేదని కేవలం పవన్ కళ్యాణ్ ను తిట్టాలనే లక్ష్యంతోనే ఉంటారని ఆది విమర్శించారు.
పవన్ కళ్యాణ్ ను తిట్టే శాఖ అని ఒకటి పెట్టుకుంటే బాగుంటుందని అన్నారు.
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డబ్బుకు లొంగడని ప్రేమకు మాత్రమే లొంగుతాడని అన్నారు.
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పాపులర్ అవుదామని అనుకుంటే జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తుకు వస్తాడని అన్నారు.
మీరు బిజినెస్ లు చేసుకుంటూ రాజకీయాలు చేసుకోవచ్చు. ఆయన సినిమాలు చేసుకోకూడదా అంటూ ఆది ప్రశ్నించారు.
ఒక్క వ్యక్తి నిజాయితీని చూసి 151 మంది భయపడటమే నిజమైన రాజకీయం. అబివృద్ది గురించి ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారం గా మాట్లాడటం.
ఒకరిని చూసి భయపడటం రాజకీయం కాదు. పవన్ కళ్యాణ్ ది నిలకడలేని రాజకీయం కాదు.. నికార్సైన రాజకీయమని హైపర్ ఆది(Hyper Aadi) అన్నారు
ఒట్టేసి చెప్తున్నా.. హైపర్ ఆది
మీఇంటికి పెళ్లికి ఆయన రావాలనే వారు ఆయన గౌరవానికి భంగం కలిగిస్తే కోపం రాదా? ఆయనతో ఫోటోల కోసం గుమ్మాలవద్ద నిలబడి ఆయనే నాతో పోటో దిగాడనే మాటలు మాట్లాడితే మాకు కోపం రాదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కులాల వెనుక ఉండే వ్యకి కాదు. ఆయన అన్ని కులాలను వెనుకఉండి నడిపించే వ్యక్తి. నన్ను కన్నతల్లి మీద ఒట్టేసి చెబుతున్నాను ఆయన నికార్సయిన రాజకీయనాయకుడు.
నాకు తెలిసి ఈ ఏరియా వారికి కులపిచ్చి లేదు. ఇందాక ఒక వ్యక్తిని మీదే కులం అని అడిగితే శ్రీకాకుళం అన్నాడని ఆది చమత్కరించారు. పవన్ కళ్యాణ్ ని ప్రేమతోనే సొంతం చేసుకోవాలని.. ఆయన డబ్బుకు లొంగే వ్యక్తి కాదని చెప్పాడు. అదేవిధంగా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని కౌంటర్ వేస్తున్న వైసీపీ నాయకులు భవిష్యత్తులో ఆయన దత్తపుత్రుడు కాదు అంజనీపుత్రుడు అని తెలుసుకుంటారని చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
కానిస్టేబుల్ కొడుకు పార్టీకి.. సైకిల్ మెకానిక్ కొడుకు మద్దతు
ఫస్ట్ టైం.. ఉత్తరాంధ్ర కళాకారులతో కలసి స్టేజిపై డ్యాన్స్ చేసిన పవన్ కళ్యాణ్
వైసీపీ జెండా మోసేవారికే సంక్షేమ పథకాలు- నాదెండ్ల మనోహర్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/