Home / Srisailam
శ్రీశైలం దేవస్థానంలో స్వామి వారి ఉచిత దర్శనానికి వెళ్లే క్యూలైన్ లో భక్తులకు పునుగు పిల్లి కనిపించింది. ఈ విషయాన్ని ఆలయ సిబ్బందికి తెలియజేశారు. అక్కడి చేరుకున్న సిబ్బంది పునుగు పిల్లిని అక్కడి నుంచి సమీప అడవిలోకి తరలించారు.స్వామి వారి దర్శనం కన్నా ముందు పునుగు పిల్లి దర్శనం అయిందని భక్తులు మాట్లాడుకున్నారు
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవస్ధానంలో అగ్ని ప్రమాదం సంబవించింది. ఆలయంలోని అన్నపూర్ణ భవన్ లో ఈ ఘటన చోటు చేసుకొనింది.
నల్లమల్ల ప్రకృతి అందాల నడుమ కొలవై ఉన్న శ్రీశైల భ్రమరాంభ మల్లికార్జున స్వామి వారి దేవస్థానాని ఎంతో విశిష్టత ఉంది. ద్వాదస జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ శ్రీశైలానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. కేవలం దేవస్థానమే కాకుండా చుట్టూ ప్రకృతి అందాల శోభతో పలు పర్యాటక ప్రాంతాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. వివిధ జలపాతాలు, నల్లమల ఫారెస్ట్ లో సఫారీ వంటివి పర్యాటకలను ఎంతగానో ఆకట్టుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ దీపావళి సెలవుల్లో ఓ సారి శ్రీశైలం ట్రిప్ వేసేద్దామా.
శ్రీశైలం ఆలయంలో నూతనంగా ఉదయాస్తమాన సేవ, ప్రదోషకాల సేవలను ప్రారంభించారు ఆలయ ఈవో లవన్న. ఈ రెండు సేవలను పరిపాలనా భవనంలో ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. సెప్టెంబర్ 5 నుండి ఈ సేవలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.