Last Updated:

Pawan Kalyan: జగన్ సర్కార్ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం.. పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసేందుకు రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను ఏపార్టీకి మద్దతివ్వాలో ఎవరూ చెప్పనవసరంలేదని అన్నారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019లో ఒంటరిగానే పోటీ

Pawan Kalyan: జగన్ సర్కార్ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం.. పవన్ కళ్యాణ్

Andhra Pradesh: రాష్ట్రంలో ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసేందుకు రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను ఏపార్టీకి మద్దతివ్వాలో ఎవరూ చెప్పనవసరంలేదని అన్నారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019లో ఒంటరిగానే పోటీ చేశామన్న పవన్ 2024 ఎన్నికల్లో ఎవరితో పోటీ చేస్తామనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. రాష్ట్రంలో విధ్వంస పూరిత రాజకీయాలు చేస్తున్నప్పుడు శత్రువులతోనైనా కలుస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మా పార్టీని మా నేతలను గౌరవించే వారితో ముందుకు సాగుతామని పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు. విధ్వంస రాజకీయాలకు పాల్పడుతూ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్ సర్కార్ ను మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని పవన్ తెలిపారు.

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా, అదే నినాదంతో పని చేస్తామని పవన్ ప్రకటించారు. అదే తమ పార్టీ నినాదమని తేల్చి చెప్పారు. వైసీపి వ్యతిరేక ఓటున చీలనివ్వనని మరోసారి స్పష్టం చేసారు. పొత్తుల పైన పవన్ మరోసారి వ్యాఖ్యలు చేసారు. వైసీపీ పాలన ఏపీకి హానికరమని చెప్పుకొచ్చారు. తాను బీజేపీ భాగస్వామినేనని, టీడీపీతో కలుస్తామని చెప్పినా, చివరి వరకు ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో కోవర్టులు ఉన్నారన్న పవన్ కల్యాణ్ తనను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇష్టం లేకపోతే కోవర్టులు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని అన్నారు.

ఎవరు ఎంత చెప్పినా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకే వెళతానని జనసేనాని స్పష్టం చేశారు. రాయలసీమలో అడుగుపెట్టాలంటే భయపడే విధంగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని పవన్ అన్నారు. రాయల సీమ వెనుకబాటుతనానికి పాలకులే కారణమన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. పార్టీ నిర్మాణంలో ఉన్న లోపాలను సరి దిద్దుకోవటానికి సమయం కేటాయిస్తామని పేర్కొన్నారు. తన అధ్యక్షతన పార్టీలో క్రమశిక్షణా సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: