Last Updated:

Girls Missing : చిత్తూరు జిల్లాలో ఒకేరోజు ఐదుగురు అమ్మాయిలు, పల్నాడు జిల్లాలో ఒకమ్మాయి మిస్సింగ్..

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఒకే రోజు ఐదుగురు అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అలానే పల్నాడు జిల్లాలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని మూడ్రోజులుగా కనిపించకుండా పోయింది. ఈ వరుస మిస్సింగ్ కేసు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మిస్ అయిన అమ్మాయిల వివరాలు పోలీసులు

Girls Missing : చిత్తూరు జిల్లాలో ఒకేరోజు ఐదుగురు అమ్మాయిలు, పల్నాడు జిల్లాలో ఒకమ్మాయి మిస్సింగ్..

Girls Missing : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఒకే రోజు ఐదుగురు అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అలానే పల్నాడు జిల్లాలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని మూడ్రోజులుగా కనిపించకుండా పోయింది. ఈ వరుస మిస్సింగ్ కేసు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మిస్ అయిన అమ్మాయిల వివరాలు పోలీసులు టే;ఈపిన ప్రకారం ఈ విధంగా ఉన్నాయి..

తిరుపతి జిల్లాలోని ఒజిలికి చెందిన నందిని అనే అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆమె కోసం కుటుంబసభ్యులు ఎంత గాలించినా లాభం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.

ఇక ఇలాగే కుప్పం పట్టణంలో ఇద్దరు అమ్మాయిలు మిస్సయ్యారు. రమ్య, కీర్తి గురువారం ఇళ్లనుండి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

పీలేరులో సానిఫా, కేవీ పల్లెలో రమ్యశ్రీ అనే మరో ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్ కేసులు కూడా పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి.

ఇలా ఒకేరోజు ఐదురుగు అమ్మాయిలు ఒకే జిల్లా పరిధిలో అదృశ్యం అవ్యవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.  అదే విధంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో కూడా ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. స్థానికంగా ఉన్న చైతన్య జూనియర్ కాలేజీలో వైష్ణవి ఇంటర్మీడియట్ చదువుతోంది. కాలేజీకి వెళుతున్నానని చెప్పి మూడు రోజుల క్రితం ఆమె ఇంట్లోంచి వెళ్ళింది. కానీ ఇప్పటివరకు తిరిగి ఇంటికి చేరుకోలేదు. కూతురు ఆచూకీ కోసం అంతటా గాలించినా ఫలితం లేకపోవడంతో ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. అయినప్పటికీ వైష్ణవి ఆఛూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

కాగా ఈ ఘటనలో ఆ ఆయువతి కాలేజ్ కి వచ్చినట్లు సీసీ టీవి ఫుటేజ్ లో రికార్డు అయ్యింది. కానీ సదరు యువతి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది.. ఎలా మిస్ అయ్యింది అనే ప్రశ్నలకు కాలేజ్ యాజమాన్యం బదులు చెప్పకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.

 

ఇవి కూడా చదవండి: