Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని నిందితుడిగా సీబీఐ చేర్చింది. ఎంపీ అవినాష్ రెడ్డిని తండ్రి భాస్కర్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా అవినాష్ రెడ్డిని సహనిందితుడిగా సీబీఐ చేర్చింది. దీంతో నేడు హైదరాబాద్ లో మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ ఎదుట అవినాష్ విచారణకు హాజరు కానున్నాడు.
వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని నిందితుడిగా సీబీఐ చేర్చింది. ఎంపీ అవినాష్ రెడ్డిని తండ్రి భాస్కర్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా అవినాష్ రెడ్డిని సహనిందితుడిగా సీబీఐ చేర్చింది. దీంతో నేడు హైదరాబాద్ లో మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ ఎదుట అవినాష్ విచారణకు హాజరు కానున్నాడు.
ఏపీలో వైఎస్ వివేకా హత్య కేసు సంచలనం రేపింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది.
ఈ కేసులో అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
మరోసారి నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది. విచారణ సమయంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.
నేడు సీబీఐ విచారణకు అవినాష్ హాజరుకానున్నారు. పులివెందుల నుంచి హైదరాబాద్‌కు ఆయన బయల్దేరారు.
హత్య కేసులో సహ నిందితుడిగా చేర్చి విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పులివెందుల నుంచి హైదరాబాద్‌కు ఆయన బయల్దేరారు. అవినాష్ వెంట చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు భారీగా వైకాపా నేతలు బయల్దేరారు.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకానున్నారు.
కాగా, తెలంగాణ హైకోర్టులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ అనుమతించింది.
సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్టు బెంచ్ స్పష్టం చేసింది.