Last Updated:

Viswak Sen : తెలుగోడి ఆత్మగౌరవం ఎన్టీఆర్ అంటున్న విశ్వక్ సేన్.. VS11 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న వారిలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. "ఈ నగరానికి ఏమైంది" సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఆ తర్వాత ఫలక్ నామా దాస్ మూవీతో ప్రేక్షకుల్లో మంచి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

Viswak Sen : తెలుగోడి ఆత్మగౌరవం ఎన్టీఆర్ అంటున్న విశ్వక్ సేన్.. VS11 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

Viswak Sen : టాలీవుడ్ యంగ్ హీరోలలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న వారిలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. “ఈ నగరానికి ఏమైంది” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఆ తర్వాత ఫలక్ నామా దాస్ మూవీతో ప్రేక్షకుల్లో మంచి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత హిట్, పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం.. లేటెస్ట్ గా వచ్చిన  “దాస్ కా దమ్కీ” సినిమాలతో సూపర్ హిట్ లను సొంతం చేసుకున్నాడు.

ఇక ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ హీరో.. ప్రస్తుతం గామి, VS10, VS11 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే గామి షూటింగ్ పూర్తి చేసిన విశ్వక్.. మిగిలిన రెండు సినిమాలను శరవేగంగా షూటింగ్ చేస్తున్నాడు. కాగా VS11 సినిమాని చల్ మోహన్ రంగ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ నిర్మాణంలో రాబోతుంది. ఇక ఈ సినిమాలో  తెలుగు బ్యూటీ అంజలి హీరోయిన్ గా నటిస్తుండగా..  తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించబోతున్నాడు. గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో విశ్వక్ (Viswak Sen) సరికొత్త లుక్ లో కనిపించబోతుండడం మరో ప్రత్యేక విషయం అని చెప్పాలి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఈ లుక్ ని రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో విశ్వక్ (Viswak Sen) షార్ట్ హెయిర్ తో, గడ్డం మీసాలు, లుంగీ, నోటిలో బీడీతో పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే విశ్వక్ బ్యాక్ గ్రౌండ్ లో “తెలుగోడి ఆత్మగౌరవం ఎన్టీఆర్ అని రాసి.. పక్కనే నందమూరి తారక రామారావు ఫోటో ఉంది. దీంతో ఈ మాస్ లుక్ తో అటు తన ఫ్యాన్స్ ని.. ఎన్టీఆర్ అభిమానులను ఫుల్ ఫిదా చేసేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.