Last Updated:

Supreme Court : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రామచంద్రభారతి పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

Supreme Court : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రామచంద్రభారతి పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Telangana News: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు విముఖత చూపెట్టింది. ఈ మేరకు హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది. సిట్‌పైన ఉన్న ఆంక్షలు ఎత్తివేసింది. సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను పరిష్కరించాలని జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం ఆదేశించింది.

.నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతి రిమాండ్‌ను సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే రామచంద్రభారతి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. కేసు విచారణ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే పిటిషనర్‌కు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించే హక్కు ఉందని తెలిపింది.

తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల వ్యవహారంపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ కేసును హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారిస్తోంది. ఈ కేసులో రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజీలు నిందితులుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి: