Rythu Bharosa: గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. నేటి నుంచి ఖాతాల్లోకి రూ.12వేలు
Telangana government to released under Rythu Bharosa: తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే రైతులకు మేలు చేయాలనే ఉద్ధేశంతో రైతు భరోసాకు సంబంధించిన నిధులను విడుదల చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నారాయణపేట జిల్లా కోస్గి మండంలోని చంద్రవంచ గ్రామంలో ఈ నాలుగు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
అలాగే, రైతు భరోసా కింద పంటకు పెట్టుబడి సాయం, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు నేటి నుంచి ఖాతాల్లో జమ కానున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ ఏడాది రైతు భరోసా కింద ప్రతి ఏకరాకు రూ.12వేలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. కాగా, ఆదివారం సెలవు దినం కావడంతో నేటి నుంచి బ్యాంకుల్లో నేరుగా నగదు తీసుకునేందుకు అవకాశం ఉందన్నారు. రైతులకు యాసంగికి పెట్టుబడి సాయం, కూలీలకు రూ.6వేలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం మల్లేపల్లిలో జరిగిన ప్రజాపాలన గ్రామసభలో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ పథకాలను మంత్రి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు మేలు జరగాలనే రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రాస్ట్ర ఖజానాను ఖాతీ చేసిన రైతుల కోసం రుణాలు మాఫీ చేశామన్నారు. ఈ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ పథకాలు అందుతాయని చెప్పారు. ఏడాదికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల వరకు ఇస్తామన్నారు.