Cabinet Sub-Committe: సర్కార్ కీలక నిర్ణయం.. సమస్యల పరిష్కారంపై క్యాబినెట్ సబ్ కమిటీ

Telangana Government Forms Cabinet Sub-Committe: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, సమస్యల పరిష్కారంపై మంత్రి వర్గ సబ్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. సినీ పరిశ్రమలో సినిమా పెద్దలు లేవనెత్తిన అంశాలపై చర్చించి నిర్ణయించాలని సీఎం సూచించారు.

అయితే, ఈ కమిటీలో ప్రభుత్వం నుంచి ఇద్దరు మంత్రులు, ఇండస్ట్రీ నుంచి నిర్మాతలు ఉండే అవకాశం ఉంది. ఈ కమిటీలో ఏబీసీ చైర్మన్ దిల్ రాజు, ఐదుగురు లేదా ఏడుగురితో సబ్ కమిటీ ఏర్పాటు కానుంది. ఈ సబ్ కమిటీ నిర్ణయం మేరకు సమస్యల పరిష్కారం కానున్నాయి.

కాగా, ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై అధ్యయనం చేయనుంది. భవిష్యత్తులో సినీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, అదరపు షోల నిర్వహణ, టికెట్ల రేట్లు పెంపు తదితర విషయాలపై నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే సినీ పరిశ్రమ సైతం ఓ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు.