Somesh Kumar: సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుడిగా సోమేశ్ కుమార్

మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేబినేట్ హోదాతో కూడిన తన ప్రధాన సలహాదారుడిగా సోమేశ్ కుమార్ ను నియమించుకున్నారు.

Somesh Kumar: మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేబినేట్ హోదాతో కూడిన తన ప్రధాన సలహాదారుడిగా సోమేశ్ కుమార్ ను నియమించుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సోమేష్ కుమార్ లో ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు సోమేశ్ కుమార్ కృతజ్హతలు తెలిపారు.

 

ఏపీలో జాయిన్ అయిన కొద్ది రోజులకే..

కాగా, గతంలో సోమేశ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. అయితే, ఆయనను ఆంధ్రప్రదేశ్ కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఈ విషయంలో కేంద్ర పరిపాలన ట్రెబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆయనకు ఏపీకి బదిలీ అయ్యారు. అయితే ఏపీలో జాయిన్ అయిన కొద్ది రోజుల తర్వాత సోమేశ్ కుమార్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఆయనకు సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆయా శాఖల్లో కీలక సంస్కరణలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ తనదైన ముద్ర వేశారు. ఈ పదవి తీసుకున్నప్పటి నుంచి రాజకీయ విమర్శలను, ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా తనదైన శైలిలో ప్రభుత్వ వ్యవస్థను ముందు నుంచి నడిపిన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయ వనరులను సృష్టించడంలో దిట్టగా పేరొందారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు , వాణిజ్య పన్నుల శాఖల ద్వారా ఆదాయాన్ని రెండు, మూడిందలు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఆయా శాఖల్లో కీలక సంస్కరణలు చేపట్టారు.