Site icon Prime9

kumari Aunty: కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్.. అక్కడే కొనసాగించమని ఆదేశం

kumari Aunty

kumari Aunty

 kumari Aunty:హైదరాబాద్ లో సోషల్ మీడియా సంచలనం గా మారిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మంగళవారం ఆమె దుకాణాన్ని మూసివేయించిన పోలీసులు వేరే చోటకు మార్చాలని ఆదేశించిన విషయం తెలిపింది. అయితే తాజాగా ప్రభుత్వం అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ కొనసాగించుకోవచ్చని తెలిపింది. ప్రజా పాలనలో ప్రభుత్వం వ్యాపారస్తులతో ఉంటుందని తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందని త్వరలోనే ఆమె ఫుడ్ స్టాల్ ను సందర్శిస్తామని తెలిపింది.

సోషల్ మీడియా యూజర్లకు పరిచయం అక్కర్లేని పేరు కుమారి ఆంటీ. అమె వద్ద ఆహార పదార్దాలు ప్రత్యేకించి నాన్ వెజ్ కూరలు బాగుంటాయని టాక్. వీటి ధర కూడా చాలా ఎక్కువ ఉంటుందని పలువురు చెప్పగా మరికొందరు ధరలు ఎక్కువయినా రుచి బాగుంటుందని మరికొందరు చెబుతుంటారు. దీనితో అతి తక్కువ సమయంలో మాదాపూర్ లోని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఫేమస్ అయింది. అయితే దీనివలన ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అవుతోందంటూ ట్రాఫిక్ పోలీసులు ఆమె దుకాణాన్ని మూయించారు. మరో చోట పెట్టుకోవాలని చెప్పారు. దీనితో ప్రభుత్వమే తనను ఆదుకోవాలంటూ కుమారి వేడుకుంది.

సోషల్ మీడియా వార్..( kumari Aunty)

ఇదిలా ఉంటే మాదాపూర్ లో ఈ ఫుడ్ స్టాల్ మూసివేత ఏపీలోని రాజకీయపార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్దానికి దారితీసింది. గతంలో యూట్యూబ్ లో మాట్లాడిన కుమారి తనకు సీఎం జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు వచ్చిందని చెప్పింది. ఇది వైరల్ గా మారింది. జగన్ కు అనుకూలంగా మాట్లాడిందనే టీడీపీ, జనసేనలు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి ఆమె దుకాణాన్ని మూయించారంటూ వైసీపీ అభిమానులు ఆరోపించారు. టీడీపీ, జనసేన అభిమానులు దీనికి కౌంటర్ ఇచ్చారు. మొత్తంమీద తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫుడ్ స్టాల్ కొనసాగించమని చెప్పడంతో వివాదం సమసింది.

Exit mobile version