Keerthy Suresh: పెళ్లి తర్వాత కీర్తి సురేష్ షాకింగ్‌ నిర్ణయం – షాక్‌లో ఫ్యాన్స్

  • Written By:
  • Updated On - December 26, 2024 / 04:26 PM IST

Keerthy Suresh Shocking Decision: ‘మహానటి’ కీర్తి సురేష్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపట్టిన కీర్తి ఇక సినిమా బ్రేక్‌ ఇవ్వబోతుందట. దీనిపై కోలీవుడ్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇది తెలిసి కీర్తి సురేష్‌ ఫ్యాన్స్‌ అంతా షాక్‌ అవుతున్నారు. ఇటీవల డిసెంబర్‌ 12న కీర్తి తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. గోవాలో జరిగిన వీరి డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రలు మాత్రమే హాజరయ్యారు. అయితే పెళ్లయిన తర్వాత వెంటనే తన బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్‌ ప్రమోషన్స్‌లో పాల్గొంది.

భర్తతో ఏ హనీమూన్‌కి వెళుతుందో అని అంతా అభిప్రాయపడ్డారు. కానీ, బేబీ జాన్ ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో పాల్గొని అందరికి షాకిచ్చింది. అది తాళిబొట్టుతోనే హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా బాగా వైరల్‌ అయ్యాయి. అంతేకాదు అలా తాళిబోట్టుతో హాజరవ్వడంతో ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో స్పెషల్‌ అట్రాక్షన్‌ నిలిచింది ఈ ‘మహానటి’. అయితే సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన కీర్తి సురేష్‌, బాబీ జాన్‌తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ప్రమోషనల్‌ కార్యక్రమాలకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఆమె గ్లామర్‌కు నార్త్‌ ఆడియన్స్‌ ఫిదా అయ్యారనిపిస్తుంది.

ఈ చిత్రంతో అక్కడ కూడా మంచి క్రేజ్‌ తెచ్చుకున్నట్టే అనిపిస్తుంది. మహానటితో జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ఈ సినిమాకు గానూ ఆమె ఉత్తమ నటి నేషనల్‌ అవార్డు కూడా అందుకుంది. ఇటీవల దసరా వంటి చిత్రాలకు సైమా, ఫలిం ఫేర్‌ అవార్డు అందుకుంది. ప్రస్తుతం కీర్తికి సౌత్‌లో ఫుల్‌ క్రేజ్‌ ఉంది. ఇక్కడ స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆమె వరుస ఆఫర్స్‌ కూడా అందుకుంటుంది. పాన్‌ ఇండియా, లేడీ ఒరియంటెడ్‌, భారీ బడ్జెట్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా వరుస అవకాలు అందుకుంటున్నాయి. చెప్పాలంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో కీరి కెరీర్‌ పీక్‌లో ఉందనే చెప్పాలి. నిజానికి కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌ కొనసాగుతున్న క్రమంలో ఏ హీరోయిన్‌ అయినా పెళ్లికి దూరంగా ఉంటుంది.

కానీ కీర్తి మాత్రం బోల్డ్‌ డెసిజన్‌ తీసుకుని ప్రియుడితో ఏడడుగులు వేసింది. కెరీర్‌ పీక్‌లో ఉండగానే ఆమె పెళ్లి చేసుకుంటుందని తెలిసి చాలా మంది షాక్‌ అయ్యారు. అయితే ఇప్పుడు సినిమాలకు కూడా బ్రేక్‌ తీసుకునే ప్లాన్‌ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల్లో నిజమేంతో తెలియదు. కానీ ఇది తెలిసి అంతా షాక్‌ అవుతున్నారు. తన సినీ కెరీర్‌ పీక్‌లో ఉండగానే ఇలాంటి నిర్ణయం కరెక్ట్‌ కాదంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియదు. కానీ కీర్తి మాత్రం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి పూర్తి వైవాహిక జీవితంపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టాలనుకుటుందట. తన భర్త ఆంటోనికి పూర్తి సమయం కేటాయించాలని, వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలనే ఈ నిర్ణయం తీసుకుంటుందని టాక్‌. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కీర్తి సురేష్‌ స్వయం ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.