Last Updated:

Film Fare Awards 2023 : 2023 ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటీనటులు ఎవరంటే?

2023 సంవత్సరానికి గాను ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ ను తాజాగా ప్రకటించారు. గురువారం రాత్రి ముంబై లోని జియో జియో కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌కు చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరై సందడి చేశారు. కాగా ఈ ఏడాది గంగూబాయి కాఠియావాడి, బదాయ్‌ దో చిత్రాలను ఎక్కువగా అవార్డులు వరించాయి. 

Film Fare Awards 2023 : 2023 ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటీనటులు ఎవరంటే?

Film Fare Awards 2023 : 2023 సంవత్సరానికి గాను ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ ను తాజాగా ప్రకటించారు. గురువారం రాత్రి ముంబై లోని జియో జియో కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌కు చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరై సందడి చేశారు. కాగా ఈ ఏడాది గంగూబాయి కాఠియావాడి, బదాయ్‌ దో చిత్రాలను ఎక్కువగా అవార్డులు వరించాయి. 9 విభాగాల్లో గంగూబాయి చిత్రం అవార్డులను సొంతం చేసుకోవడం గమనార్హం. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న “ది కశ్మీర్‌ ఫైల్స్‌” చిత్రానికి ఒక్క అవార్డు కూడా రాకపోవడం గమనార్హం. ఈ ఫంక్షన్ లో అలియా భట్‌, జాన్వీ కపూర్‌, భూమి పెడ్నేకర్, పూజాహెగ్డే, ఫాతిమా సనా ఖాన్‌, దియా మీర్జా, నర్గీస్‌ ఫక్రీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సన్నీ లియోని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ -2023 విజేతల వివరాలు (Film Fare Awards 2023)..

ఉత్తమ చిత్రం : గంగూబాయి కాఠియావాడి

ఉత్తమ దర్శకుడు : సంజయ్‌ లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి)

ఉత్తమ నటుడు : రాజ్‌కుమార్‌ రావ్‌ (బదాయ్‌ దో)

ఉత్తమ నటి : అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి)

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) : బదాయ్‌ దో (హర్షవర్థన్‌ కుల్‌కర్ణి)

ఉత్తమ నటుడు(క్రిటిక్స్‌) : సంజయ్‌ మిశ్రా (వధ్‌)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌) : టబు (భూల్‌ భులయా2), భూమి పెడ్నేకర్‌ (బదాయ్‌ దో)

ఉత్తమ సహాయ నటుడు : అనిల్‌ కపూర్‌ (జగ్‌జగ్‌ జీయో)

ఉత్తమ సహాయ నటి : షీబీ చద్దా (బదాయ్‌ దో)

ఉత్తమ గీత రచయిత : అమితాబ్‌ భట్టాచార్య (కేసరియా: బ్రహ్మాస్త్ర: శివ)

ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌ : ప్రీతమ్‌ (బ్రహ్మాస్త్ర: శివ)

ఉత్తమ నేపథ్య గాయకుడు : అర్జిత్‌ సింగ్‌ (కేసరియా: బ్రహ్మాస్త్ర: శివ)

ఉత్తమ నేపథ్య గాయని : కవిత సేథ్‌ (రంగిసరి- జగ్‌జగ్‌ జీయో)

ఉత్తమ కథ : అక్షిత్‌ గిల్‌డియల్‌, సుమన్‌ అధికారి(బదాయ్‌ దో)

ఉత్తమ స్క్రీన్‌ప్లే : అక్షిత్‌ గిల్‌డియల్‌, సుమన్‌ అధికారి, హర్షవర్థన్‌ కుల్‌కర్ణి( బదాయ్‌ దో)

ఉత్తమ సంభాషణలు : ప్రకాశ్‌ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కాఠియావాడి)

ఉత్తమ సినిమాటోగ్రఫీ : సుదీప్‌ ఛటర్జీ (గంగూబాయి కాఠియావాడి)

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ : సుబ్రత చక్రవర్తి, అమిత్‌ రాయ్ ‌(గంగూబాయి కాఠియావాడి)

ఉత్తమ కాస్ట్యూమ్స్‌ : సీతల్‌ ఇక్బాల్‌ శర్మ (గంగూబాయి కాఠియావాడి)

ఉత్తమ సౌండ్‌ డిజైన్‌ : బిస్వదీప్‌ దీపక్‌ ఛటర్జీ (బ్రహ్మాస్త్ర: శివ)

ఉత్తమ ఎడిటింగ్‌ : నినద్‌ ఖనోల్కర్‌ (ఏన్‌ యాక్షన్‌ హీరో)

ఉత్తమ యాక్షన్‌ : పర్వేజ్‌ షేక్‌ (విక్రమ్‌ వేద)

ఉత్తమ వీఎఫ్‌ఎక్స్‌ : డెంజ్‌, రెడీఫైన్‌ (బ్రహ్మాస్త్ర పార్ట్‌-1: శివ)

ఉత్తమ కొరియోగ్రఫీ : కృతి మహేశ్‌ (దోలిడియా-గంగూబాయ్‌ కాఠియావాడి)

ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : జస్పాల్‌ సింగ్‌సంధు, రాజీవ్‌ బర్నవాల్‌ (వధ్‌)

ఉత్తమ తొలి చిత్ర నటుడు : అంకుష్‌ గీదమ్‌ (ఝండ్‌)

ఉత్తమ తొలి చిత్ర నటి : ఆండ్రియా కెవిచూసా (అనేక్‌)

జీవిత సాఫల్య పురస్కారం : ప్రేమ్‌ చోప్రా

ఆర్డీ బర్మన్‌ అవార్డు : జన్వీ శ్రీమంకర్‌ (దోలాడియా : గంగూబాయి కాఠియావాడి)