Last Updated:

AP Deputy CM Pawan Kalyan: ఏపీలో డ్రగ్స్ పరిస్థితి దారుణంగా ఉంది.. ఆస్ట్రేలియా తరహాలో చట్టాలు!

AP Deputy CM Pawan Kalyan: ఏపీలో డ్రగ్స్ పరిస్థితి దారుణంగా ఉంది.. ఆస్ట్రేలియా తరహాలో చట్టాలు!

AP Deputy CM Pawan Kalyan IN Student and Parents at Mega Parents-Teachers Meet: ఏపీలో డ్రగ్స్ పరిస్థితి దారుణంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కడప మున్సిపల్‌లో పర్యటిస్తున్న ఆయన ఓ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్- టీచర్స్ మీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలను డ్రగ్స్ నుంచి దూరం చేయాలన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని, ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఆస్ట్రేలియా తరహాలో సోషల్ మీడియా చట్టాలు తీసుకొస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అయితే డ్రగ్స్ సరఫరా విషయం చాలా ఆశ్చర్యకరంగా ఉందని, డ్రగ్స్ ఈ స్థాయికి చేరిపోయిందా? అన్నారు. చిన్నతనంలో వినేవాళ్లమని.. డ్రగ్స్ దేశాన్ని చంపేయడమంటే.. మత్తు మందుకు అలవాటు చేస్తే దేశం చచ్చిపోతుందన్నారు.

ఓపీఎం ఎలా ఉంటుందో అందరికీ తెలుసన్నారు. చైనా ఓపీఎం మాదిరిలా అందరికీ మత్తు పదార్థాలు అలవాటు చేస్తే.. వారికి తిరగబడే శక్తితో పాటు ఆలోచించే శక్తి కూడా కోల్పోతారన్నారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ప్రక్రియ ప్రణాళికతో ఎవరైనా చేస్తున్నారా ? అనుకోకుండా జరుగుతుందా? అనే విషయంపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ ఎక్కువగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కూడా విపరీతంగా పెరుగుతోందన్నారు.

ప్రతీ తల్లిదండ్రులు మీ బిడ్డలకు సైబర్ క్రైమ్, సోషల్ మీడియా వాడకం వంటి విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. సోషల్ మీడియాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలని సూచించారు. ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. 16 ఏళ్ల వయసు ఉన్న వారు సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయకూడదని చెప్పిందన్నారు. అలాంటివి ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఆలోచిస్తామన్నారు.