Last Updated:

Kim Jong Un: 36 రోజులపాటు కనిపించని కిమ్ జోంగ్ ఉన్.. అనారోగ్యమే కారణమా?

ఉత్తర కొరియా కొరియన్ పీపుల్స్ ఆర్మీ (KPA) యొక్క 75వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని ఫిబ్రవరి 8, బుధవారం జరుపుకోనుంది. అయితే అధినేత కిమ్ జోంగ్ ఉన్ దాదాపు 36 రోజుల పాటు కనిపించకుండా పోయారు.

Kim Jong Un: 36 రోజులపాటు కనిపించని కిమ్ జోంగ్ ఉన్.. అనారోగ్యమే కారణమా?

Kim Jong Un: ఉత్తర కొరియా కొరియన్ పీపుల్స్ ఆర్మీ (KPA) యొక్క 75వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని

ఫిబ్రవరి 8, బుధవారం జరుపుకోనుంది.

అయితే అధినేత కిమ్ జోంగ్ ఉన్ దాదాపు 36 రోజుల పాటు కనిపించకుండా పోయారు.

దీనితో కిమ్ అనారోగ్య సమస్యలపై చర్చ మొదలయింది.

అతని కీలకమైన సమావేశాలు మరియు ఇతర బహిరంగ కార్యక్రమాలను సాధారణంగా కవర్ చేసే

మీడియా ఈ విషయంలో ఆసక్తిని ప్రదర్శించకపోవడం విశేషం.

కిమ్ జోంగ్ ఉన్ కు అనారోెగ్యమా ?..(Kim Jong Un)

కిమ్ ఏదైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని,

ముఖ్యంగా ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతుంటాడని

అంతర్జాతీయ మీడియా ఊహించింది. అతని ఆరోగ్య సమస్యల గురించి పలు మీడియా

నివేదించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అతను 40 రోజులకు పైగా కనపడలేదు.

కరోనా సమయంలో కనిపించని కిమ్ జోంగ్ ఉన్ ..

2020లో, కరోనావైరస్ దాదాపు ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడు, ఏప్రిల్ 15 న జరిగిన

కీలక రాష్ట్ర వార్షికోత్సవ కార్యక్రమంలో అతను గైర్హాజరు కావడం అతని ఆరోగ్యం గురించి చర్చను లేవనెత్తింది.

అతను చనిపోయి ఉంటాడని కూడా కొన్ని మీడియా కథనాలు ప్రసారం చేసింది.

గత ఏడాది 35 రోజులపాటు కనిపించని  కిమ్ జోంగ్ ఉన్ ..

అనంతరం2021లో, అతను 35 రోజులకు పైగా ఎటువంటి సైనిక సమావేశాలు లేదా బహిరంగ ర్యాలీలలో కనిపించలేదు.

తాజాగాఅతను 36 రోజుల పాటు కనిపించలేదు.

సోమవారం నాటి విస్తరించిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC) సమావేశంలో

కిమ్ మళ్లీ కనిపించినట్లు NK న్యూస్ నివేదించింది. మీడియా నివేదికల ప్రకారం,

అతను యుద్ధ సంసిద్ధతకు సంబంధించిన “తీవ్రమైన” కార్యాచరణ శిక్షణ గురించి ఆదేశించాడు.

 

తన పొరుగు దేశాన్ని ఎదుర్కోవడానికి తన యుద్ధ ట్యాంకులు, ఫిరంగిదళాలు మరియు

ఇతర కీలకమైన పరికరాలను పెంచాలని కిమ్ సైన్యాన్ని ఆదేశించినట్లు కూడామీడియా సంస్థలు కూడా నివేదించాయి.

అలాగే, అమెరికాను చేరుకోగల సామర్థ్యం ఉన్న మరిన్ని ప్రాణాంతక క్షిపణులను సిద్ధం చేయాలని చెప్పినట్లు నివేదికలు ఉన్నాయి.

అయితే, అతను తన 9 ఏళ్ల కుమార్తె కిమ్ జు-ఏతో సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడా లేదా

ఏదైనా వైద్య చికిత్స పొందుతున్నాడా అని ఏ మీడియా సంస్థలు కూడా నివేదించలేదు.

దక్షిణ కొరియా సరిహద్దులో పెరిగిన పెట్రోలింగ్ ..

మరోవైపు ఉత్తర సరిహద్దు దగ్గర పెట్రోలింగ్‌లో గణనీయమైన పెరుగుదలను దక్షిణ కొరియా గుర్తించింది

దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ప్రతినిధి, లీ సుంగ్-జున్ మంగళవారం ఒక బ్రీఫింగ్ సందర్భంగా మాట్లాడుతూ,

పరేడ్ రిహార్సల్స్‌కు సంబంధించిన ప్రాంతాలలో “సిబ్బంది మరియు వాహనాలలో గణనీయమైన పెరుగుదలను

దక్షిణ కొరియా సైన్యం గుర్తించిందనిపేర్కొన్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/