Russia-Ukraine war: ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై బాంబుల వర్షం

రష్యా, ఉక్రెయిన్ దేశాల మద్య జరుగుతున్న యుద్ధ వాతావరణంలో మరో కీలకం చోటుచేసుకొనింది. గడిచిన 8 నెలలుగా సాగుతున్న యుద్దం నేపధ్యంలో నేడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై భీకర బాంబు దాడులు చోటుచేసుకొన్నాయి. అత్యంత కీలక దాడులుగా ఉక్రెయిన్ దేశం ప్రకటించింది

Kyiv: రష్యా, ఉక్రెయిన్ దేశాల మద్య జరుగుతున్న యుద్ధ వాతావరణంలో మరో కీలకం చోటుచేసుకొనింది. గడిచిన 8 నెలలుగా సాగుతున్న యుద్దం నేపధ్యంలో నేడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై భీకర బాంబు దాడులు చోటుచేసుకొన్నాయి. అత్యంత కీలక దాడులుగా ఉక్రెయిన్ దేశం ప్రకటించింది.

సమాచారం మేరకు, నేటి ఉదయం రాజధాని కీవ్ నగరం పై వరుస పేలుళ్లు సంభవించాయి. మిసైల్ దాడులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. పలు భవంతుల పై భారీ యెత్తున పొగలు ఎగసి పడ్డాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్దంలో కొద్ది రోజుల విరామం తర్వాత కీవ్ నగరంపై దాడి జరిగింది. దాడికి 90 నిమిషాల ముందు గగనతల దాడి గురించి హెచ్చరిస్తూ సైరన్ మోగిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. క్షిపణి దాడుల్లో పలువరు మరణించగా, అధిక సంఖ్యలో గాయపడిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సిటీ సెంటర్ లో బాంబు దాడులు జరిగిన్నట్లు మేయర్ విటాలియ్ క్లిష్కెకో తెలిపారు.

ఆశ్రయాలను విడిచిపెట్టవద్దని ప్రజలను పదే పదే హెచ్చరించారు. భూభాగం నుండి మమ్మల్ని తుడిచివేయాలని రష్యా చేస్తున్న ప్రయత్నాలుగా పేర్కొన్నారు. క్రిమియాను రష్యాకు కలిపే వంతెన పై పేలుడుకు కైవ్ కారణమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించిన మరుసటి రోజు ఈ పేలుళ్లు జరగడం గమనార్హం.

ఇంకా అనేక నగరాల పై బాంబు దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్లు పౌరులను హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో వరుస పేలుళ్ల తర్వాత ప్రాణనష్టం జరిగినట్లు ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ ప్రతినిధి స్వెత్లానా తెలిపారు. నేడు జరిగిన బాంబు దాడుల ఘటనలను పలువురు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేశారు.

ఇది కూడా చదవండి: మెక్సికోలో దారుణం..18 మందిని కాల్చి చంపిన ముష్కరులు