Site icon Prime9

Lucky Bhaskar: ఓటీటీలోకి లక్కీ భాస్కర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Lucky Baskhar OTT release date confirmed: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా.. తొలి రోజు నుంచి మంచి టాక్ సంపాదించుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే సూపర్ హిట్‌ మూవీగా నిలిచింది.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిని ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, నెట్‌ఫిక్స్ ఓ అనౌన్స్‌మెంట్ విడుదల చేసింది. ఈ మూవీ నవంబర్ 28నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. ఈ మూవీ తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది.

ఇదిలా ఉండగా, ఈ మూవీ నవంబర్ 30న లేదా డిసెంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అంతకంటే ముందే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా, సినిమా విడుదలైన నెలరోజుల ముందే స్ట్రీమింగ్ కానుంది.

Exit mobile version