Site icon Prime9

Australia vs India: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

India creates history with 1st win over Australia: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 205 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది.

భారత్ విధించిన 534 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ తడబడింది. ఇన్నింగ్స్ ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్ మెక్‌స్వీనీని బుమ్రా ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత కూడా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో 12 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

నాలుగో రోజు ఇన్సింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ను సిరాజ్ ఆరంభంలోనే దెబ్బ తీశాడు. రెండో ఓవర్‌లోనే ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేశాడు. 17 పరుగులకు 4 వికెట్లు కోల్పోగా.. ట్రావిస్ హెడ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. స్టీవ్ స్మిత్‌తో కలిసి ఆరో వికెట్‌కు 89 పరుగులు చేశారు.

నిలకడగా ఆడుతున్న స్మిత్‌(17)ను సిరాజ్ ఔట్ చేయడంతో కీలక భాగస్వామ్యానికి తెర పడింది. తర్వాత మిచిలె్ మార్ష్(47)తో కలిసి హెడ్ ఏడో వికెట్‌కు 22 పరుగులు జోడించాడు. క్రీజులో పాతుకుపోయిన హెడ్‌ను బుమ్రా ఔట్ చేశాడు. ఆఫ్ సైడ్ వేసిన బంతిని షార్ట్ కొట్టే సమయంలో వికెట్ కీపర్ పంత్‌కు దొరికిపోయాడు. ఆ తర్వాత మార్ష్ కూడా ఔట్ అయ్యాడు. దీంతో ఆసీస్.. 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

అలెక్స్, స్టార్క్ ఎనిమిదో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. అయితే టీ బ్రేక్‌కు ముందు సుందర్ బౌలింగ్‌లో స్టార్క్ ఔటయ్యాడు. ఆ తర్వాత హర్షిత్ రాణా బౌలింగ్‌లో అలెక్స్(36) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత్ బౌలర్లలో బుమ్రా, సిరాజ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. సుందర్ రెండు వికెట్లు, నితీశ్ రెడ్డి, హర్షిత్ చెరో వికెట్ తీశారు.

Exit mobile version
Skip to toolbar