Site icon Prime9

Mexico: మెక్సికోలో దారుణం..18 మందిని కాల్చి చంపిన ముష్కరులు

Worse in Mexico. Gunmen who shot dead 18 people including the mayor-

Worse in Mexico. Gunmen who shot dead 18 people including the mayor-

Mexico: మెక్సికోలో ఆగంతుకులు చెలరేగిపోయారు. విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 18 మంది మృతిచెందారు. ఘటనలో మేయర్ తో సహా పోలీసులు కూడా మరణించారు. దీంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.

మీడియా కథనాల సమాచారంతో, మెక్సికో నైరుతి ప్రాంతంలోని గెరెరో మిగ్యుల్ టోటోలాపెన్ నగరంలో టౌన్ హాల్లో కౌన్సిల్ సమావేశం జరుగతుండగా ఈ ఘటన చోటుచేసుకొనింది. పథకం ప్రకారం టౌన్ హాల్ ను చుట్టుముట్టిన ముష్కరుల కాల్పుల్లో మేయర్ కాన్రాడో మెన్డోజా అల్మెడా తో పాటు మరో 17 మంది అక్కడిక్కడే మరణించారు. వీరిలో కొంతమంది పోలీసులు కూడా ఉన్నట్లు సమాచారం.

ఆగంతుకులు పక్కా స్కెచ్ తో టౌన్ హాలుపై దాడి చేశారు. అంతకుముందు మేయర్ ఇంటి వద్ద అతని తండ్రి క్వాన్ మెండోజా అకోస్టా ను నిర్ధాక్షిణ్యంగా చంపేసారు. ఘటనకు ముందు ఆ టౌన్ హాలు ప్రాంతంలోకి భధ్రతాదళాలు ప్రవేశించకుండా పట్టణంలోకి పోలీసులు ప్రవేశించకుడా పలు రహదారుల్లో భారీ వాహనాలను సైతం అడ్డుగా ఉంచి మరీ దారుణానికి ఒడిగట్టారు.

దాడికి పాల్పొడిన నేరస్తులను కనుగొనడానికి జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. సైన్యాన్ని రంగంలోకి దింపి జలమార్గాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి:Elon Musk: ట్విట్టర్ కొనుగోలుకే మస్క్ ఆసక్తి..!

Exit mobile version