Site icon Prime9

Ram Gopal Varma: ఆర్జీవీ ఇంటి వద్ద హైటెన్షన్.. అరెస్ట్‌కు రంగం సిద్ధం

Police Reached Director Ram Gopal Varma Residence: హైదరాబాద్‌లోని సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. అయితే వర్మ ఇంట్లో ఆయన లేరని సిబ్బంది చెప్పడంతో ఒంగోలు నుంచి వచ్చిన పోలీసులు అక్కడే ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోలీసులు ఉదయమే ఆయన ఇంటికి చేరుకున్నారు. ఒకవేళ ఆర్జీవీ విచారణకు సహకరించకపోతే వెంటనే అరెస్ట్ చేసి ఒంగోలుకు తరలించనున్నట్లు సమాచారం.

రామ్ గోపాల్ వర్మ.. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లపై వ్యక్తిగతంగా కించపరిచేలా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్జీవీపై పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు పంపించారు.

అయితే రెండు సార్లు నోటీసులు ఇవ్వగా.. ఆయన గడువు కావాలని కోరారు. కాగా, సోమవారం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈ విచారణకు ఆర్జీవీ హాజరుకాకపోవడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం రాంగోపాల్ వర్మ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, నోటీసులు అందిన వెంటనే ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను అరెస్ట్ నుంచి రక్షణ కావాలంటూ హైకోర్టుకు వెళ్లగా.. ఆయనకు బిగ్ షాక్ తగిలింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని కోర్టు వెల్లడడించింది.

Exit mobile version