Last Updated:

Natural Star Nani visits Sabarimala: శబరిమల వెళ్లిన హీరో నాని

ధారణంగా ప్రతి సంవత్సరం హీరోలు అయ్యప్ప స్వామిమాలలు ధరించి దీక్ష చేయడం  తెలిసిందే.  ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఎన్టీఆర్ లాంటి హీరోలు మాలలు ధరిస్తారు. అయితే తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా అయ్యప్ప మాల దీక్ష చేపట్టారు.

Natural Star Nani visits Sabarimala: శబరిమల వెళ్లిన  హీరో నాని

Natural Star Nani: సాధారణంగా ప్రతి సంవత్సరం హీరోలు అయ్యప్ప స్వామిమాలలు ధరించి దీక్ష చేయడం  తెలిసిందే.  ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఎన్టీఆర్ లాంటి హీరోలు మాలలు ధరిస్తారు. అయితే తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా అయ్యప్ప మాల దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో మాల ధరించి ఇరుముడితో శబరిమల స్వామిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమల కొండకు చేరుకున్న నాని.. తన ట్రిప్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నాని స్వామివారి ఇరుముడి తీసుకుని తన కుమారుడు అర్జున్‌తో కలిసి శబరిమలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ శబరిమల యాత్ర వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఈ వీడియోలో ఇరుముడితో ఆలయాన్ని కాలినడకన దర్శించుకుని పద్దెనిమిది మెట్ల వద్ద తన కుమారుడితో కలిసి దీపాలు వెలిగించి స్వామిని దర్శించుకున్నారు

నాని ప్రస్తుతం దసరా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.

follow us

సంబంధిత వార్తలు

Most Viewed Articles