Home / గాసిప్స్
దర్శకుడు సుకుమార్‌తో గతంలో విజయ్ దేవరకొండ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు సెట్స్ పైకి రాలేకపోయింది.విజయ్ తన ప్రాజెక్ట్స్ లైగర్, కుషి మరియు జన గణ మనతో బిజీగా ఉండగా, సుకుమార్ తన చిత్రం పుష్ప 2 కోసం పని చేస్తున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో లీడర్ 2 సినిమా చేయడానికి శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నట్టు ఈ మధ్య కాలంలో ప్రచారం జరుగుతోంది. ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మాతల్లో ఒకరైన అరుణ గుహన్‌ని సమీప భవిష్యత్తులో లీడర్ 2 చేసే అవకాశం గురించి అడిగినపుడు ఆమె స్పందించారు.
ఆచార్య డిజాస్టర్‌తో నష్టపరిహారం కోసం దర్శకుడు కొరటాల శివపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒత్తిడి చేయడం ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. కొరటాల బయ్యర్లలో ఒకరికి నష్టపరిహారం చెల్లించి సెటిల్ చేయడానికి ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తుండగా, మెగా క్యాంప్ నుండి కొత్త రిపోర్ట్ వచ్చింది.
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్‌ను బాలీవుడ్ నిర్మాత వినోద్ భానుశాలి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అటల్ అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం వాజ్‌పేయి బాల్యం నుండి ఆయన రాజకీయ జీవితం వరకు సాగిన ప్రయాణాన్ని తెలియజేస్తుంది.
తన చివరి చిత్రం రెడ్ పరాజయం తర్వాత హీరో రామ్ పోతినేని తన తాజా చిత్రం ది వారియర్ విడుదలకోసం ఎదురుచూస్తున్నాడు. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటించింది.