Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉందని తెలుసా..!

జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే జూలై 16 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

  • Written By:
  • Updated On - July 17, 2023 / 07:29 AM IST

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే జూలై 16 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

కోర్టు కేసు ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం విషయంలో శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. ప్రయాణాల్లోనూ, ఆరోగ్యం విషయంలోనూ వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృషభం..

ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. అవసరమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ బాధ్యతలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆస్తి సంబంధమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

మిథునం..

వ్యాపారాలలో పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. దైవ కార్యాలలో పాల్గొం టారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా చాలా వరకు బయటపడతారు. కొత్త ప్రయత్నాలకు, కొత్త నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.

కర్కాటకం..

ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంటుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండడం గానీ, వాగ్దానాలు చేయడం కానీ చేయవద్దు. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఒక ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారం ఒకటి అనుకోకుండా, అప్రయత్నంగా అనుకూలం అవుతుంది.

సింహం..

ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వారమంతా ప్రశాంతంగా, ఆనందంగా గడిచిపోతుంది. కార్యసిద్ధికి, వ్యవహార జయానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

కన్య..

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువుల్లో కొందరు అపనిందలు వేయడం గానీ, దుష్ప్రచారం చేయడం గానీ జరుగుతుంది. మిత్రుల్లో కూడా కొందరు తప్పుదోవ పట్టించి లబ్ధి పొందే సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది.

తుల..

మిత్రులు, సన్నిహితుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. ఇరుగు పొరుగు వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది.

వృశ్చికం..

ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు కొద్దిగా అసంతృప్తి కలిగిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు చికాకు పెడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తోబుట్టువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

ధనస్సు..

ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తే వ్యాపారాలు, వ్యవహారాలు విజయవంతం అవుతాయి. కుటుంబంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

మకరం..

మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల రాకపోకలుంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి కాస్తంత ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పిల్లలకు సంబంధించి మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతానికి పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.

కుంభం..

అనారోగ్యం సమస్యలు, రుణ సమస్యలు అదుపులో ఉంటాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలపరంగా లబ్ధి చేకూరుతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆర్థిక ప్రయత్నాల విషయంలో మరింత పట్టుదలగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యక్తిగత వ్యవహారాలలో కార్యసిద్ధి ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

మీనం..

ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహా రాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.