Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఎవరినీ అయినా గుడ్డిగా నమ్మడం మంచిది కాదని తెలుస్తుంది. అలాగే నవంబర్ 21 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
మేషం..
ఉద్యోగంలో విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను మించిన రాబడి లభిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. కొందరు మిత్రుల విషయంలో అప్రమత్తంగా ఉండక తప్పదు.
వృషభం..
కుటుంబంతో కలిసి విహార యాత్ర చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన సంతృప్తి కరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. సంతానానికి సంబంధించి శుభ వార్త వింటారు. కొన్ని దైవ కార్యాల్లో పాల్గొంటారు.
మిథునం..
ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు న్నాయి.
కర్కాటకం..
వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. వృథా ఖర్చుల్ని అదుపు చేయడం మంచిది. కుటుంబ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
సింహం..
ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవు తాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా చక్కబడతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.
కన్య..
ఉద్యోగంలో బాగా ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో విశ్రాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవచ్చు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి.
తుల..
వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్త అందుతుంది.
వృశ్చికం..
అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు, అదరణ లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విష యంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పిల్లలు చదువుల్లో మంచి పురోగతి సాధిస్తారు. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది.
ధనస్సు..
ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచ యాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
మకరం..
వృత్తి, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు, కొత్త కార్యక్రమాలు ప్రవేశపెడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో బాగా పని ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపో తుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఉండవచ్చు. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కుంభం..
కుటుంబంతో కలసి ఇష్టమైన ఆలయాన్ని సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యక్తి గత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ప్రయాసతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం..
ఆస్తి సంబంధమైన శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు, వ్యూహాలు ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు. కుటుంబ జీవితం హాయిగా గడిచిపోతుంది.