Last Updated:

Husband killed wife for insurance money: రూ. 1.90 కోట్ల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భార్యను చంపిన భర్త

రాజస్థాన్‌లోని జైపూర్‌లో రూ. 1.90 కోట్ల బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి తన భార్యను రోడ్డు ప్రమాదంలో చంపేశాడు.

Husband killed wife for insurance money: రూ. 1.90 కోట్ల ఇన్సూరెన్స్  సొమ్ము కోసం భార్యను చంపిన భర్త

Rajasthan: రాజస్థాన్‌లోని జైపూర్‌లో రూ. 1.90 కోట్ల బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి తన భార్యను రోడ్డు ప్రమాదంలో చంపేశాడు. దీనితో మహేశ్ చంద్ ముఖేష్ సింగ్ అనే హిస్టరీ-షీటర్‌ను నియమించుకున్నాడు. అతను తన కారుతో మహేష్ భార్య తన కజిన్‌తో కలిసి వెళుతున్న మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో ప్రమాదంలో ఇద్దరూ చనిపోయారు.

అక్టోబర్ 5న జైపూర్‌లోని హర్మదాలో ఉన్న సమోద్ ఆలయాన్ని సందర్శించేందుకు మహేష్ భార్య షాలు, తన బంధువు రాజుతో కలిసి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. హత్యకు ముందు చంద్ తన భార్యకు రూ.1 కోటి 90 లక్షలకు బీమా చేయించాడు. దీనిపై డీసీపీ వందిత రాణా మాట్లాడుతూ.. మహేశ్‌, అతని భార్య షాలు మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపారు. షాలూ 2019లో మహేష్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది, ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు.పథకం ప్రకారం జరిగిన కుట్రలో భాగంగా, బాలాజీని 12 సార్లు దర్శించుకుంటే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చని ఒక పండిట్ చెప్పాడని మహేశ్ తన భార్యతో చెప్పాడు. మరోవైపు, షాలును చంపేందుకు గాను 10 లక్షల రూపాయల కాంట్రాక్టులో భాగంగా 5.50 లక్షల రూపాయలను ముఖేష్ సింగ్ రాథోడ్‌కు చెల్లించాడు.తన భర్త ఒత్తిడితో, షాలు తన బంధువు రాజుతో మోటారు సైకిల్‌పై ఆలయానికి వెళుతుండగా కారు ఢీకొనడంతో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా బైక్‌ పక్కగా వెళుతుండగా ఎస్‌యూవీ ఉద్దేశ్యపూర్వకంగా ఇద్దరిని ఢీకొట్టినట్లు గుర్తించారు. నాలుగు నెలల క్రితమే మహేశ్‌ షాలు ప్రమాదవశాత్తు మరణానికి బీమా చేయించినట్లు విచారణలో తేలింది.ఈ కేసుకు సంబంధించి మహేశ్ , రాజు, ముఖేష్ సింగ్ రాథోడ్, సోనూ సింగ్, రాకేష్ బైర్వా సహా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి: