Aadhaar update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటి నుంచే అప్డేట్ చేసుకునే ఛాన్స్!

Aadhaar update: దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరికీ ఆధారే.. ఆధారంగా మారింది. అయితే ఆధార్ విషయంలో కేంద్రం నిత్యం అప్డేట్స్ ప్రకటిస్తూనే ఉంటుంది. తాజాగా, దేశ ప్రజలకు ఆధార్‌పై బిగ్ అప్డేట్ ప్రకటించింది. ఆధార్ కార్డులో మార్పులు చేసుకునేందుకు మీ సేవా సెంటర్లకు పరుగెత్తి క్యూ నిల్చోవాల్సిన అవసరం లేకుండా సరికొత్త నిర్ణయం తీసుకురానుంది. ఆధార్ అప్టేట్ కోసం యూఐడీఏఐ క్యూఆర్ కోడ్ ఆధారిత యాప్ తీసుకొస్తుంది.
గతంలో అడ్రస్, పేరుతో పాటు డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలను ఆన్ లైన్ లో మార్చుకునేందుకు అవకాశం ఉండేది. కానీ ఇందులో ఫోటో, ఫోన్ నంబర్, బయోమెట్రిక్, ఈ మెయిల్ వంటి వాటిని మార్చుకునేందుకు తప్పనిసరిగా ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు యూఐడీఏఐ గుడ్ న్యూస్ చెప్పింది.
యూఐడీఏఐ వివరాల ప్రకారం.. నవంబర్‌లో కొత్త యాప్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ యాప్ లో ఆధార్ కు సంబంధించిన అప్డేట్స్ ఎక్కడినుంచైనా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా, కేవలం ఐరిస్ స్కానింగ్, బయోమెట్రిక్ కోసం మాత్రమే ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
ఆధార్ అప్టేట్ కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లకుండా యాప్ ద్వారా ఇంటి నుంచే అన్ని పనులు చేసుకోవచ్చు. ఈ అప్డేట్ తో పాటు ఆధార్ వివరాలు మరింత సులభంగా, వ్యక్తిగత గోపత్య పరిగణలోకి తీసుకొని నకిలీ పత్రాలను అరికట్టనుంది. అంతేకాకుండా ప్రతీ అప్డేట్ ను ఓటీపీ ఆధారంగా చేసేలా యూఐడీఏఐ చర్యలు తీసుకుంది.
ఇక వివరాలు నమోదు చేయాలంటే ఫోన్ నంబర్ లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ లింకింగ్ ప్రక్రియ వేగంగా కానుంది. ఇలా యాప్ అందుబాటులోకి వస్తే ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. నేరుగా ఇంటి నుంచే ఆధార్ కార్డులో అప్డేట్స్ చేసుకోవచ్చు. అలాగే, ఈ విధానం అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యలు, ఆధార్ సెంటర్ ల్లో రద్దీ తగ్గే అవకాశం ఉంది.