Home /Author Chaitanya Gangineni
‘ప్రేమ పావురాలు’ సినిమాతో సంచలనం సృష్టించిన అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ గుర్తుంది కదా. ఆమె కుమార్తె అవంతిక దసాని. తాజాగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. బెల్లంకొండ గణేష్ పక్కన ‘నేను స్టూడెంట్ సర్’మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా జూన్ 2 న రిలీజ్ అయింది. లండన్ లో బిజినెస్ అండ్ మార్కెటింగ్ డిగ్రీ పూర్తి చేసిన అవంతిక నటనలోకి అడుగుపెట్టింది. జీ 5 ఒరిజనల్ లో ‘మిథ్య’ అనే వెబ్ సిరీస్ తో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది అవంతిక.
అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి భార్య నల్లపూసల గొలుసు మింగేశాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. చివరకు అతనికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యలు హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
అమెజాన్ నుంచి మరో స్మార్ట్ స్పీకర్ భారత మార్కెట్ లో రిలీజ్ అయింది. అమెజాన్ నుంచి ఇంతకు ముందు వచ్చిన ఎక్ డాట్ లాగానే తాజాగా ‘ఎకో పాప్’ పేరుతో ఈ స్పీకర్ లాంచ్ అయింది.
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన అవతరణ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా రాజ్ భవన్ లో కేక్ కట్ చేశారు. అక్కడ నృత్యకారులతో కలిసి తమిళసై ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.
వచ్చే ఏడాది నుంచి కర్ణాటకలో ఐఫోన్ల తయారీ ఉంటుందని రాష్ట్ర భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి పాటిల్ వెల్లడించారు. టెక్ దిగ్గజం యాపిల్ కు కాంట్రాక్ట్ తయారీ సంస్థగా ఉన్న ఫాక్స్ కాన్ ఈ తయారీని చేపట్టబోతోందని ఆయన తెలిపారు.
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయంలోని ధ్వజ స్తంభం దగ్గర వందల ఏళ్ల నాటి పెద్ద రావి చెట్టు ఉంది. ఈ రావిచెట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా కుప్ప కూలింది. ఆకస్మాత్తుగా చెట్టు కూలడంతో ఒకరు మృతి చెందారు.
ఈ కాలంలో ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో బరువు తగ్గాలనుకుంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అదే విధంగా మంచి ఆహారంతో పాటు అది తీసుకునే సమయం కూడా ముఖ్యమంటున్నారు పోషకార నిపుణులు.
ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు భారీ స్థాయిలో నమోదు చేస్తున్నాయి. ఏ నెలకు ఆ నెల వస్తు సేవల పన్ను వసూళ్లలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. కాగా, తాజాగా మే నెలకు సంబంధించిన వస్తు, సేవల పన్ను వివరాలు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మరో సారి డీఏ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ నుంచి మరో స్కూటర్ రాబోతుంది. ప్రస్తుతం ఏథర్ కంపెనీ నుంచి 450 శ్రేణిలో రెండు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. 450 ఎక్స్ పేరుతో