Home /Author Chaitanya Gangineni
గురువారం కూడా దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. దీంతో వరుసగా రెండో రోజు నష్టాలు చవి చూశాయి. ఈ రోజు ప్లాట్ గా ప్రారంభించిన మార్కెట్లు రోజు మధ్యాహ్నం వరకు స్పల్ప లాభాలతో ట్రేడ్ అయ్యాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ఆర్ తెలంటాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణను లిక్కర్ రాష్ట్రంగా మార్చారని షర్మిల విమర్శించారు.
బాలీవుడ్ నటి అలియా భట్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అలియా తాతయ్య నరేంద్ర రజ్దాన్ (93) గురువారం కన్ను మూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న నరేంద్ర రజ్దాన్.. వారం రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ తో జత కట్టి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాయ్ లక్ష్మీ. ‘కాంచన మాల కేబుల్ టీవీ’తో తెలుగు తెరకు పరిచయం అయింది. మొదట ఆశించిన విజయాలు దక్కకపోవడంతో లక్ష్మీ రాయ్ జాతక రీత్యా రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకుంది. ఈ పేరుతో తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు విజయాలు అందుకుంది. ‘ఖైదీ నంబర్ 150’ లో చిరంజీవి సరసన రత్తాలుగా చిందేసి బాగా ఫేమసైంది.
కరోనా సంక్షోభంతో అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ పద్దతిని అనుసరించాయి. దాదాపు మూడేళ్లుగా ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కు ముగింపు పలుకుతున్నాయి.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వన్ప్లస్ ఇండియా సీఈఓ నవనీత్ నక్రా రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి వైదొలుగుతున్నట్టు తెలిపారు. నవనీత్ నక్రా రాజీనామాను వన్ప్లస్ కూడా ధ్రువీకరించింది.
ప్రతి ఏటా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో నియామకాల కోసం ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్’ పరీక్ష నిర్వహిస్తుంటుంది. తాజాగా 2023 కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ప్రపంచలోనూ అత్యంత ధనవంతుడిగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మళ్లీ అవతరించాడు. ఆ స్థానంలో ఇప్పటివరకు ఉన్న ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద 2.6 శాతం పడిపోవడంతో ‘బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ సూచీ’లో మస్క్ టాప్ కి చేరారు.
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై సౌత్ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ పలు కీలక విషయాలు సేకరించింది. కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర నిద్రలేమి తో బాధపడుతున్నట్టు గుర్తించింది.
మన దేశంలో ఎన్నో చూడదగిన విష్ణుమూర్తి ఆలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైంది మహారాష్ట్రలోని పండరీపుర్ దేవాలయం. స్థానికంగా ఇక్కడ ప్రజలు పాండురంగ స్వామిని విఠలుడు అని పిలుచుకుంటారు. అధ్యాత్మిక టూరిజంలో భాగంగా పండరీపుర్, షిరిడీ వెళ్లే పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.