Poco M6 Plus 5G: బంగారం లాంటి ఆఫర్.. పోకో టాప్ సెల్లింగ్ ఫోన్ రూ.12 వేలకే.. మిస్ అయితే రాదు..!
Poco M6 Plus 5G: దేశంలోని మొబైల్ మార్కెట్లో షియోమి సంస్థ వివిధ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేస్తుంది. అందులో కంపెనీ పోకో ఎమ్ సిరీస్ ఫోన్లు చౌక ధరతో మొబైల్ ప్రియుల దృష్టిని ఆకర్షించాయి. కంపెనీ ఇప్పుడు ఆకర్షణీయమైన ఫీచర్లతో Poco M6 Plus 5G ఫోన్‌ను ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్. ఈ ఫోన్ Snapdragon 4s ప్రాసెసర్‌తో వస్తుంది.
Poco M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ సైట్‌లో పెద్ద తగ్గింపుతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ 128GB స్టోరేజ్ వేరియంట్‌పై 30 శాతం తగ్గింపు లభించింది. కస్టమర్లకు రూ. 12,499కి ఆర్డర్ చేయచ్చు. ఈ ఫోన్ Snapdragon 4s ప్రాసెసర్‌తో పవర్ ఫుల్‌గా ఉంటుంది.
Poco M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీ బ్యాకప్‌తో పాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ కలిగి ఉంది. ఇందులో 108 మెగా పిక్సెల్ సెన్సార్ కెపాసిటీతో కూడిన ప్రైమరీ కెమెరా కూడా ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Poco M6 Plus 5G Features
ఈ స్మార్ట్‌ఫోన్ 6.79-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణను కూడా కలిగి ఉంది. డిస్‌ప్లే 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది మరియు అధిక ప్రకాశం (450 నిట్‌ల సాధారణ ప్రకాశం) మోడ్‌లో గరిష్టంగా 550 నిట్‌ల ప్రకాశం ఉంటుంది.
ఫోన్ Qualcomm Snapdragon 4 Gen 2 AE చిప్‌సెట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది అన్ని గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌లను నిర్వహించడానికి Adreno A613 GPUతో లింకై ఉంటుంది. ఇది రెండు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. అందులో 6GB RAM + 128GB+ 8GB RAM + 128GB ఉన్నాయి.ఫోన్‌లో Samsung ISOCELL HM6 సెన్సార్‌తో కూడిన 108-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. అదనంగా 2MP మాక్రో కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా అందించారు.
Poco M6 Plus 5G ఫోన్ 5,030mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IR బ్లాస్టర్, IP53 రేటింగ్ ఉంటుంది. ఫోన్ Android 14 ఆధారంగా తాజా HyperOS పై రన్ అవుతుంది. 2 సంవత్సరాల OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లతో వస్తుంది. 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6 802.11 ac (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.1, GPS + GLONASS, USB టైప్-C ఉన్నాయి.