Last Updated:

Vivo Mobile Offers: అమెజాన్ ఆఫర్ల రచ్చ.. వివో Y300 ప్లస్ మొబైల్‌పై భారీ ఆఫర్.. ఇది కింగ్ మావ..!

Vivo Mobile Offers: అమెజాన్ ఆఫర్ల రచ్చ.. వివో Y300 ప్లస్ మొబైల్‌పై భారీ ఆఫర్.. ఇది కింగ్ మావ..!

Vivo Mobile Offers: ఫెస్టివల్ ముగిసినా ఆఫర్ల హడావుడి మాత్రం తగ్గలేదు. వివో తన కొత్త Vivo ఫోన్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ గత నెలలో భారతదేశంలో కొత్త Vivo Y300 ప్లస్ మొబైల్‌ను విడుదల చేసింది. దీనిని రూ.23,999తో పరిచయం చేశారు. ప్రస్తుతం ఈ ఫోన్ ధరను తగ్గించారు. అంతేకాకుండా రూ. 1,750 తగ్గింపు కూడా ఇస్తున్నారు. అమెజాన్ నుంచి ఈ మొబైల్ ఆర్డర్ చేయచ్చు. ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రండి దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

వివో Y300 ప్లస్ ఫోన్ అమెజాన్‌ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఫోన్ 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,  50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. ఇది క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్ 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 8GB RAM +128GB స్టోరేజ్, 5000mAh బ్యాటరీ, 44W ఫ్లాష్ ఛార్జ్‌ని కూడా ప్యాక్ చేస్తుంది.

ఈ వివో Y300 ప్లస్ ఆఫర్ల విషయానికి వస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే రూ.1750 తగ్గింపు లభిస్తుంది. మీరు 12, 18 నెలల పాటు EMI చేస్తే 1500 రూపాయలు తక్షణ తగ్గింపు పొందొచ్చు.

అలానే 6 లేదా 9 నెలల ఈఎమ్ఐపై రూ.1250 అదనపు తగ్గింపు లభిస్తుంది. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐ, పీఎన్‌బీ నాన్-క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐ చెల్లింపులపై 1000 తగ్గింపు లభిస్తుంది. అమెజాన్‌లో Vivo Y300 Plus మొబైల్ కొనుగోలుపై 6 నెలల పాటు నో కాస్ట్ EMI అందుబాటులో ఉంటుంది.

Vivo Y300 Plus Features
వివో Y300 ప్లస్ మొబైల్ 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది పంచ్ హోల్ డిస్‌ప్లే. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. అదనంగా ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 695 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో కంపెనీ విడుదల చేసింది. ఈ ప్రాసెసర్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్‌పై తయారైంది.

స్మార్ట్‌ఫోన్‌లో 8GB RAM ఉంది. ఈ మొబైల్ 8GB ఎక్స్‌పాండబుల్ ర్యామ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 8GB ఫిజికల్ ర్యామ్‌తో పాటు 16GB RAM అందుబాటులో ఉంది. ఇందులో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఇది మెమరీ కార్డ్ ద్వారా 1 TB వరకు పెంచుకోవచ్చు. మొబైల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో LED 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా అందుబాటులో ఉంది.

సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.కంపెనీ వివో వై300 ప్లస్‌ను 5000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 44W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ అందించారు. స్మార్ట్‌ఫోన్ డస్ట్, వాటర్  రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్, Wi-Fi, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.