Rare Land Rover Series II: మది దోచేస్తున్న అలనాటి కారు.. ఆహా అనిపిస్తున్న ఫీచర్స్!
Rare Land Rover Series IIకారు.. కేవలం అవసరం మాత్రమే కాదు అదొక ఫ్యాషన్. అందుకే కారు లవర్స్ మార్కెట్లోకి కొత్త మోడల్ వస్తుందంటే కొనకుండా ఉండలేరు. వీళ్లు పాత కార్లకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారు. అయితే రోజులు గడిచే కొద్ది కొద్ది పాత వస్తువులకు విలువ పెరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇప్పట్లో అందుబాటులో లేని వాటికైతే డిమాండ్ కోహినూరు రేంజ్లో ఉంటుంది. వాటిలో పాత కాలం నాటి కార్లు, జీపులు నేటి తరం వాళ్లకి ఎంతో గొప్పగా అనిపిస్తాయి.
ఇప్పుడు ఇటువంటి వారి కోసమే అద్భుతమైన ఆఫర్ వచ్చింది. మీరు క్లాసిక్, పాతకాలపు కార్లను ఇష్టపడితే ఈ డీల్ మీకు ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఇటీవల మైసూర్లో 1968 ల్యాండ్ రోవర్ సిరీస్ 2 షార్ట్ వీల్‌బేస్ (SWB) వేలానికి వచ్చింది. ఫేస్బుక్ మార్కెట్‌ప్లేస్‌లో దీని ధరను రూ.27 లక్షలుగా పోస్ట్ చేశారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కార్టోక్ నివేదిక ప్రకారం కారులో పవర్ బ్రేక్‌లు, పవర్ స్టీరింగ్, డీజిల్ ఇంజన్, ఫోర్-వీల్ డ్రైవ్ హార్డ్‌వేర్ ఉన్నాయి. కారులో అదనపు గ్రిల్, జెర్రీ క్యాన్ ఉన్నాయి. సిరీస్ 2 దొరకడం చాలా అరుదు. అందువలన ఇది ఒక ముఖ్యమైన కారుగా మారుతుంది. ఈ సిరీస్ IIA 1961-1971 కాలంలో తయారు చేశారు.
ల్యాండ్ రోవర్ 1958లో సిరీస్ 2ను ప్రారంభించింది. ఇది సిరీస్ 1 కంటే చాలా పెద్ద అప్గ్రేడ్లతో ఉంటుంది. ఇది ఆఫ్-రోడర్. ఇది రౌండ్ షేప్ ఎక్స్‌ట్రనల్ స్టైలింగ్‌ను కలిగి ఉంది. దీనిలోని ఇంటీరియర్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కారులో 2.25-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది.
సిరీస్ II, సిరీస్ II A మధ్య తేడాను గుర్తించడం కష్టం. కొన్ని బ్యూటీ మార్పులు ఉన్నాయి. ఇందులో షార్ట్-వీల్‌బేస్ సాఫ్ట్-టాప్ కూడా అందుబాటులో ఉంది. లాంచ్ అయినప్పుడు సిరీస్ IIA 2.25 లీటర్ డీజిల్ ఇంజన్ ఉండేది. అయితే 1967లో తరువాత అప్డేటెడ్ 2.6 లీటర్ ఇన్లైన్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను లైనప్‌కు జోడించింది. సిరీస్ IIA ఫిబ్రవరి 1969లో దేశీయ మార్కెట్ కోసం ఒక చిన్నఅప్డేట్ పొందింది.