Best High Range Electric Scooters: బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రేంజ్లో పోటీలేదు బ్రదర్.. ధర కూడా తక్కువేగా!
Best High Range Electric Scooters: దీపావళి తర్వాత దేశంలో అన్న, చెల్లెళ్లు జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి అని అందరికి తెలుసు. అయితే సోదర, సోదరి మధ్య ప్రేమానురాగాలు పంచుకునేందుకు మరొక పండుగ భగిని హస్త భోజనం. హిందీలో దీన్నే భాయి దూజ్ అని కూడా అంటారు. దీపావళిపండుగ ముగిసిన రెండో రోజున ఈ పండుగ జరుపుకుంటారు. రాఖీ తర్వాత, భాయ్ దూజ్ పండుగను సోదరీమణులకు అత్యంత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ పండుగ అన్నదమ్ముల మధ్య విడదీయరాని బంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజును మరింత గుర్తుండిపోయేలా చేయడానికి మీరు మీ సోదరికి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా ఇవ్వచ్చు. మీరు కూడా ఇలాంటి ప్లాన్‌లో ఉన్నట్లయితే హై రేంజ్ టాప్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
TVS iQube
టీవీఎస్ ఐక్యూబ్ ఒక నమ్మకమైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్లో 2.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ స్కూటర్ 2 గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీని డ్రైవింగ్ రేంజ్ 75 కిలోమీటర్లు. ఈ స్కూటర్లో 32 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంది. దీని పొడవైన సీటు మృదువుగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఇతర వస్తువులకు చిన్న స్టోరేజ్ కూడా అందించారు. 17.78 సెంమీ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది. స్కూటర్ డిజైన్ స్టైలిష్‌గా ఉండటంతో పాటు సురక్షితంగా కూడా ఉంటుంది. ఈ స్కూటర్ ధర రూ.94,999.
Ola S1
ఓలా ఎస్1 ఎలక్ట్రక్ స్కూటర్లో 2kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌పై 95 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది 4.3 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, దీని గరిష్ట వేగం 85kmph. ఈ స్కూటర్ డిజైన్ స్టైలిష్‌గా ఉంది. అందులో సామాను ఉంచుకోవడానికి కూడా మంచి స్థలం లభిస్తుంది.
Ampere Magnus EX
ఆంపియర్ మాగ్నస్ EX కూడా సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఇ-స్కూటర్ 2.2 kWh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఫుల్ ఛార్జింగ్‌పై 100 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 సెకన్లలో 0-40 kmph నుండి వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ డిజైన్ సింపుల్‌గా ఉంది. కానీ ఇందులో మంచి స్పేస్ ఉంది. రోజువారీ ఉపయోగం కోసం ఇది మంచి స్కూటర్. స్కూటర్ ధర రూ. 94,900.
Ather Rizta
దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో ఏథర్ కూడా క్రమంగా తన పట్టును బలపరుస్తోంది. ఈ భాయ్ దూజ్కు మీరు మీ సోదరికి అథర్ రిజ్తా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా ఇవ్వచ్చు. ఈ స్కూటర్ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. దీని పరిధి ఒక్కసారి ఛార్జింగ్‌పై 160 కిలోమీటర్ల వరకు చేరుకుంటుంది. కుటుంబానికి ఇది సరైనదని కంపెనీ పేర్కొంది. ఫీచర్లు, స్పేస్ పరంగా ఈ స్కూటర్ బాగుంది.