MG Windsor: బండి మీది బ్యాటరీ మాది.. రికార్డ్ బుకింగ్‌లు సాధించిన ఎమ్‌జీ విండ్సర్!
MG Windsor: జేఎస్‌డబ్లూ ఎమ్‌జీ మోటార్ ఇటీవలే తన మొదటి క్రాస్ ఓవర్ యుటిలిటీ వాహనాన్ని విడుదల చేసింది. ఎమ్‌జీ విండర్స్ అనేది మొదటి (CUV) క్రాస్ ఓవర్ యుటిలిటీ వెహికల్. ఇది సెడాన్ కంఫర్ట్, ఎస్‌యూవీ స్థలాన్ని అందిస్తుంది. కంపెనీ ఈ కారును ఎలక్ట్రిక్ వేరియంట్‌లో విడుదల చేసింది. మొదటిసారిగా బ్యాటరీ సర్వీస్ కూడా ప్రారంభించింది. అయితే తాజాగా ఇప్పుడు దీపావళికి ముందు కంపెనీ ఈ కారు 101 యూనిట్లను డెలివరీ చేసింది. ఈ యూనిట్లు ఎమ్‌జీ జూబిలెంట్ బెంగళూరు నుంచి డెలివరీ అయ్యాయి. ఇంటెలిజెంట్ సీయూవీలను కొనేందుకు ప్రజల్లో ఎంత ఉత్సాహం ఉందో దీన్ని బట్టి తెలుస్తోందని కంపెనీ పేర్కొంది.
ఎమ్‌జీ విండ్సర్ దాని పేరు మీద మరో విజయాన్ని సాధించింది. ఈ కారు కేవలం 24 గంటల్లో 15176 బుకింగ్‌లను సాధించింది. విండ్సర్ ఈ మైలురాయిని సాధించిన మొదటి ప్యాసెంజర్ ఈవీ. ఈ కారు సెడాన్ సౌకర్యాన్ని, ఎస్‌యూవీ స్థలాన్ని అందిస్తుంది.
ఇది కాకుండా కారులో భద్రత, స్మార్ట్ కనెక్టివిటీ, డ్రైవింగ్ సౌకర్యం, హైటెక్ ఫీచర్లు కూడా అందించారు. ఈ కారు ప్యూర్ ఈవీ ప్లాట్‌ఫామ్‌లో తయారైంది. కారు లగ్జరీ బిజినెస్ క్లాస్ అనుభవాన్ని అందిస్తోంది.
ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 13,49,800 (ఎక్స్-షోరూమ్.) అయితే యూనిక్ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (బాస్) ప్రోగ్రామ్ కింద ఈ కారు ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) అవుతుంది. బ్యాటరీని కూడా అద్దెకు తీసుకోవచ్చు. ఇందుకోసం కిలోమీటరుకు రూ.3.5 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కారులో ఏరో లాంజ్ సీట్లు ఉన్నాయి. ఇవి 135 డిగ్రీల వరకు రిక్లైన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ కారులో 604 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఈ కారులో ఇన్‌స్టాల్ చేసిన బ్యాటరీ IP67-సర్టిఫైడ్. ఈ కారులో 38 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. కారు 2700 మిమీ వీల్ బేస్ కలిగి ఉంది.
ఇందులో నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు (ఎకో+, ఎకో, నార్మల్, స్పోర్ట్) ఉన్నాయి. ఇది 100KW (136ps) పవర్, 200Nm టార్క్‌తో చాలా బలమైన పనితీరును అందిస్తుంది. ఎమ్‌జీ విండ్సర్ ఈవీ ఒక ఛార్జ్‌పై ARAI ప్రకారం 332 కిమీ వరకు పరుగులు పెడుతుంది. ఈ క్రాస్ ఓవర్ యుటిలిటీ వెహికల్ మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. అందులో ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ ఉన్నాయి. ఇది స్టార్‌బర్స్ట్ బ్లాక్, పెరల్ వైట్, క్లే బీజ్, టర్కోయిస్ గ్రీన్ వంటి నాలుగు వైబ్రెంట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.