Hero XPulse 200 4V: ప్రపంచాన్ని అన్వేషించండి.. రూ.4 వేలకే అడ్వెంచర్ బైక్.. దీన్ని మించింది ఉంటుందా?
Hero XPulse 200 4V: హీరో XPulse 200 4V ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్‌లో బాగా సక్సెస్ అయింది. స్పోర్టీగా కనిపించే బైక్ బాడీ ప్యానెల్, గ్రాఫిక్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ బైక్ స్విచ్ చేయగల ABS మోడలతో సహా అనేక ఇతర ఫీచర్లతో వస్తుంది. దీని ఆన్-రోడ్ ధర రూ. 1.75 లక్షలు. బైక్ రెండు వేరియంట్‌లలో వస్తుంది. ఇందులో ప్రో, ఎస్‌టీడీ వేరియంట్‌లు ఉన్నాయి. మీరు ఈ బైక్ కొనే ప్లాన్‌లో ఉంటే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఈ స్పోర్టీ బైక్‌ను ఇప్పుడు చాలా సులభంగా కొనుగోలు చేయచ్చు. ఆన్ రోడ్ , సింపుల్ ఈఎమ్ఐ ఆప్షన్లతో ఇంటికి తీసుకెళ్లచ్చు. రాజధాని ఢిల్లీలో XPulse 200 4V STD వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 1.75 లక్షలు. రూ.40 వేలు డౌన్ పేమెంట్ చెల్లించి కొనుగోలు చేస్తే 9.7 శాతం వడ్డీ రేటుతో 42 నెలల పాటు దాదాపు రూ.38,00 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
దీని టాప్-ఎండ్ ప్రో వేరియంట్ గురించి చెప్పాలంటే దీని ఆన్-రోడ్ ధర రూ. 1.83 లక్షలు. మీరు ఈ వేరియంట్‌ను రూ.40 వేలు డౌన్‌పేమెంట్ చెల్లించి కొనుగోలు చేస్తే, మీరు 9.7 శాతం వడ్డీ రేటుతో 42 నెలలకు దాదాపు రూ.4 వేల EMI చెల్లించాలి.
అయితే XPulse 200 4V ఆన్-రోడ్ ధర, లోన్ ఎంపికలు నగరాలు, డీలర్‌షిప్‌లను బట్టి మారవచ్చు. ఇది కాకుండా రుణం లభించే వడ్డీ రేటు శాతం మీ వ్యక్తిగత క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బైక్ లోన్ 8-10 శాతం వడ్డీ రేటుతో లభిస్తుంది.
ఈ అడ్వెంచర్ స్టైల్ బైక్‌లో శక్తివంతమైన 199.6cc ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 18.9బిహెచ్‌పి పవర్, 17.35ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.
హీరో XPulse 200 4V బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కొత్తగా డిజైన్ చేయబడిన LED హెడ్‌ల్యాంప్‌లు, USB ఛార్జింగ్ పోర్ట్, స్విచ్ చేయగల 3 ABS మోడ్‌లతో అప్‌డేట్ చేయబడిన వైజర్ ఉన్నాయి.
ఈ బైక్ బరువు దాదాపు 159 కిలోలు. ఇది 220mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది, పర్వతాలలో కూడా బైక్‌ను సులభంగా నడపడానికి వీలు కల్పిస్తుంది. ఈ బైక్ సుమారు 40Kmpl మైలేజీని ఇస్తుంది.