Nobel Peace Prize 2024: జపాన్ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం
Nobel Peace Prize 2024 Awarded to Japan: ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించారు. 2024 ఏడాదికి గానూ జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థకు వరించింది. అణ్వాయుధాల రహిత ప్రపంచం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఈ మేరకు స్టాక్ఘోంలో ఉన్న కరోలిన్ స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ కమిటీ ప్రకటించింది.
ఇప్పటివరకు మొత్తం 111మంది సభ్యులు, 31 సంస్థలను నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఈ ఏడాది పురస్కారానికి 286 నామినేషన్లను పరిశీలించిన నోబెల్ కమిటీ నిహాన్ హిడాంక్యోను పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సంస్థ ప్రధానంగా హిరోషిమా, నాగసాకిపై జరిగిన అణుబాంబు దాడిలో సర్వస్వం కోల్పోయిన బాధితుల కోసం పనిచేస్తుంది.