Trump T-shirts: డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం.. చైనా టీ షర్టులకు పెరిగిన డిమాండ్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే, చైనీస్ రిటైలర్లు మరియు ఆన్‌లైన్ దుకాణాలు ట్రంప్ ఫోటోలతో కూడిన టీ-షర్టుల అమ్మకాలను ప్రారంభించాయి.
Trump T-shirts: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే, చైనీస్ రిటైలర్లు మరియు ఆన్‌లైన్ దుకాణాలు ట్రంప్ ఫోటోలతో కూడిన టీ-షర్టుల అమ్మకాలను ప్రారంభించాయి.
మూడు గంటల్లో రెండువేల ఆర్డర్లు..(Trump T-shirts)
అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసిన, భద్రతా అధికారులచే చుట్టుముట్టబడిన పిడికిలి బిగించిన ట్రంప్ ఫోటో, టావోబావో వంటి చైనీస్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో టీ-షర్టులపై అమ్మకానికి సిద్దమయింది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, అసోసియేటెడ్ ప్రెస్ ఆదివారం సాయంత్రం 6:31 గంటలకు ట్రంప్ పిడికిలి ఊపుతున్న ఫోటోను ప్రచురించింది. రాత్రి 8:00 గంటలకు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ స్పందించడానికి ముందే చైనా తయారీదారులు టీ షర్టులతో సిద్ధంగా ఉన్నారు. మొదటి బ్యాచ్ రాత్రి 8.40 గంటలకు ప్రసిద్ధ చైనీస్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ టావోబావోలో విక్రయించబడింది. మూడు గంటల్లోనే చైనా, అమెరికా రెండింటి నుండి 2,000 కంటే ఎక్కువ ఆర్డర్లను పొందింది. ఈ టీ-షర్టులకు పెరిగిన డిమాండ్‌ను చూసిన తర్వాత ఇతర రిటైలర్లు కూడా తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో జాబితా చేశారు.చైనా రిటైలర్లు ప్రధానంగా ట్రంప్ సావనీర్‌లను ఉత్పత్తి చేస్తారు, ఎందుకంటే వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంది