Chhattisgarh: చత్తీస్గఢ్లోవ్యాన్ బోల్తాపడి 19 మంది దుర్మరణం
చత్తీస్‌గఢ్‌లో పికప్ వ్యాన్ బోల్తా పడ్డంతో సుమారు 18 మంది మృతి చెందారు. వారిలో 17 మంది మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.. నలుగురికి గాయాలు అయ్యాయని చత్తీస్‌గఢ్‌లోని కబీర్‌థామ్ జిల్లాలో పికప్ వ్యాన్ లోయలోపడ్డంతో జరిగిన ఘటనతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అధికారులు సోమవారం నాడు చెప్పారు
Chhattisgarh: చత్తీస్‌గఢ్‌లో పికప్ వ్యాన్ బోల్తా పడ్డంతో సుమారు 19 మంది మృతి చెందారు. వారిలో 17 మంది మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.. నలుగురికి గాయాలు అయ్యాయని చత్తీస్‌గఢ్‌లోని కబీర్‌థామ్ జిల్లాలో పికప్ వ్యాన్ లోయలోపడ్డంతో జరిగిన ఘటనతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అధికారులు సోమవారం నాడు చెప్పారు. గాయపడిని వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తరలించామని తెలిపారు. కాగా ఈ సంఘటన బాపానీ గ్రామంలో మధ్యాహ్నం 1.45 గంటలకు జరిగింది. అయితే బాధితులంతా అడవీకి వెళ్లి బీడీ ఆకులను కోసుకొని తిరిగి వస్తుండగా వాహనం స్కిడ్ అయ్యి లోయలో పడిపోయింది. సంఘటన జరిగిన వెంటనే పోలీసు బృందం ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.
స్పాట్ లో 12 మంది మృతి..(Chhattisgarh)
ప్రమాదం జరిగిన వెంటనే 12 మంది మహిళలు ఒక వ్యక్తి అప్పటికప్పుడే మృతి చెందారు. మిగిలిన తొమ్మిదిని ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఆరుగురు మహిళలు మృతి చెందారని కబీర్దామ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అభిషేక్ పల్లవా చెప్పారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి విష్ణు వేద్సాయి సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి జిల్లా అధికారులు అత్యుత్తమ వైద్య సాయం అందిస్తారని హామీ ఇచ్చారు. అధికారులుకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశామని చెప్పారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని సాయి ఎక్స్‌లో పోస్ట్ చేశారు సీఎం.