Pawan Kalyan: ఏపీలో రోడ్డు ప్రమాదాలపై స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్
ఏపీలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దిగ్భ్రాంతి ని వ్యక్తం చేసారు . బుధవారం జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట సమీపంలో బస్సు, టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఆరుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు.
Pawan Kalyan:ఏపీలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దిగ్భ్రాంతి ని వ్యక్తం చేసారు . బుధవారం జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట సమీపంలో బస్సు, టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఆరుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు.
రోడ్డు భద్రత చర్యలు తీసుకోక పోవడం వల్లనే..(Pawan Kalyan)
ఒక పక్క బైపాస్ రోడ్ పనులు సాగుతున్న క్రమంలో తగిన విధంగా రోడ్డు భద్రత చర్యలు తీసుకోక పోవడం వల్లనే ఈ ఘోరం సంభవించి సంభవించిందన్నారు.అదే విధంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పి.గన్నవరం మండలం ఊడిమూడి సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో నలుగురు కూలీలు మరణించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలు నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. వరి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ను ఢీకొన్నట్లు తెలుస్తోంది . ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిలో ముగ్గరు జి.పెద్దపూడి, మరో ఇద్దరు ఆదిమూలవారిపాలెం వాసులుగా గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు జనసేనాని తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రహదారి ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. అదే విధంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.