Kazakhstan:భార్యను దారుణంగా చిత్ర హింసలకు గురి చేసి చంపిన కజకిస్తాన్ మాజీ మంత్రి
ఆయనొక ప్రజా ప్రతినిధి.. మాజీ మంత్రి కూడా.. అయితే ఏం లాభం...సొంత భార్యను కొట్టి కొట్టి చంపాడు. ఒళ్లు జలదరించే ఈ ఘటన కజకిస్తాన్‌లో జరిగింది. గత ఏడాది నవంబర్‌లో తన భర్తకు చెందిన బంధువు రెస్టారెంట్లో ఈ ఘోరం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పేరు కుయాండిక్ బిషింబాయేవ్. కాగా ఆయన భార్య పేరు సాల్తానాట్ నుకెనోవా.
Kazakhstan: ఆయనొక ప్రజా ప్రతినిధి.. మాజీ మంత్రి కూడా.. అయితే ఏం లాభం…సొంత భార్యను కొట్టి కొట్టి చంపాడు. ఒళ్లు జలదరించే ఈ ఘటన కజకిస్తాన్‌లో జరిగింది. గత ఏడాది నవంబర్‌లో తన భర్తకు చెందిన బంధువు రెస్టారెంట్లో ఈ ఘోరం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పేరు కుయాండిక్ బిషింబాయేవ్. కాగా ఆయన భార్య పేరు సాల్తానాట్ నుకెనోవా. ప్రస్తుతం కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. భార్య ను దారుణంగా కొట్టి కొట్టి చంపిన ఘటనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాగా ఈ ఘటన ప్రెసిడెంట్ కస్సిమ్-జోమార్ట్ టోకాయేవ్స్ కు విషయ పరీక్ష అని ఇక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని ప్రెసిడెంట్ ప్రజలకు హామీ ఇచ్చారు.
8 గంటలపాటు కొట్టి.. (Kazakhstan)
ఇక కజకిస్తాన్‌లో ప్రతి ఆరుగురిలో ఒక మహిళ గృహ హింసకు బలవుతున్నారు. మాజీ ఆర్థికమంత్రి కూడా అయిన కుయాండిక్ బిషింబాయేవ్ భార్య హత్య విచారణ గత నెలలో కోర్టులో జరిగింది. విచారణ సందర్భంగా కోర్టులో జరిగిన వాదోపవాదాల విషయానికి వస్తే బిషింబాయేవ్ తన భార్యను సుమారు ఎనిమిది గంటల పాటు తన బంధువుల హోటల్లో దారుణంగా కొట్టి కొట్టి చంపాడు. కాగా ఈ హత్య గురించి ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. కాగా కోర్టులో దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను ప్రదర్శించారు. కాగా కజకిస్తాన్‌లో విచారణ ఆన్లైన్లో జరగడం ఇదే మొదటిసారి అని మిర్రర్ ఆన్లైన్ వెల్లడించింది.మాజీమంత్రి తన భార్యను జుట్టుపట్టి లాక్కుంటూ వెళ్లడం…. అటు తర్వాత ఆమెను ఓ మూలన తోసేయడం. అక్కడ ఆమెను కొట్టడం .. తన్నడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయితే భార్యభర్తలు ఇద్దరు ఈ ఘటన జరగడానికి ఓ రోజు ముందు ఆ హోటల్లోనే గడిపారు. కాగా మాజీమంత్రి భార్యను కొన్ని గంటల పాటు కొట్టడంతో ఆమె చనిపోయారు. ఆమె చనిపోయిన 12 గంటల తర్వాత అంబులెన్స్ వచ్చింది. వచ్చి రాగానే ఆమె చనిపోయినట్లు అంబులెన్స్ వెంట వచ్చిన పారామెడికల్ సిబ్బంది తెలిపారు. పోస్ట్‌మార్టంలో ఆమె బ్రెయిన్ ట్రౌమాతో చనిపోయారని నివేదిక వచ్చింది. దాడిలో ఆమె ముక్కు ఎముక కూడా విరిగిపోయింది. ముఖం, తల, చేతులు,భుజాలపై గాయాలున్నాయి.
భార్య చనిపోయిన తర్వాత బిషింబాయేవ్ జ్యోతిష్యుడికి ఫోన్ చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీనికి జ్యోతిష్యుడు నీ భార్యకు ఏమీ కాదని హామీ ఇచ్చాడు. అయితే కోర్టులో విచారణ సందర్భంగా బిషింబాయేవ్ భార్యను చంపినందుకు ఎలాంటి పశ్చాత్తం వ్యక్తం చేయలేదు. తన భార్య సొంతంగానే గాయపర్చుకొని చనిపోయిందని కోర్టులో బుకాయించాడు. ఇదిలా ఉండగా గత నెల 15న కజకిస్తాన్ ప్రెసిడెంట్ కొత్త బిల్లును తీసుకువచ్చారు. బిల్లు పేరు సల్తానాత్ లా. భార్యను హింసించే వారిని కఠినంగా శిక్షస్తామనేది ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఈ బిల్లు పార్లమెంటులో ఆమోద ముద్ర పొందాల్సి ఉంది.