Last Updated:

JanaSena glass symbol: గాజు గ్లాసు గుర్తు పై జనసేనకు దక్కని ఊరట.

గాజు గ్లాసు సింబల్‌పై జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పాక్షిక ఊర‌ట మాత్ర‌మే ల‌భించింది….. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర‌ అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది జనసేన. ఆ పిటిషన్ పై నిన్న, ఈ రోజు కూడా వాదనలు జరిగాయి.. అయితే, నిన్న హైకోర్టును 24 గంటల సమయం కోరిన ఎన్నికల కమిషన్‌.. ఈ రోజు కీలక విషయాలను వెల్లడించింది..

JanaSena glass symbol: గాజు గ్లాసు గుర్తు పై జనసేనకు  దక్కని  ఊరట.

JanaSena glass symbol:గాజు గ్లాసు సింబల్‌పై జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పాక్షిక ఊర‌ట మాత్ర‌మే ల‌భించింది….. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర‌ అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది జనసేన. ఆ పిటిషన్ పై నిన్న, ఈ రోజు కూడా వాదనలు జరిగాయి.. అయితే, నిన్న హైకోర్టును 24 గంటల సమయం కోరిన ఎన్నికల కమిషన్‌.. ఈ రోజు కీలక విషయాలను వెల్లడించింది..

జనసేన పోటీ చేసే స్దానాలు మినహాయించి..(JanaSena glass symbol)

. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో.. గాజు గ్లాసు గుర్తును ఎంపీ అభ్యర్థులకు ఇవ్వబోమని స్పష్టం చేసింది ఈసీ.. జనసేన పోటీ చేస్తున్న 2 పార్లమెంట్ స్థానాల పరిధిలో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించమని కోర్టుకు తెలిపింది ఎన్నికల కమిషన్‌.. గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఇలా చేస్తామని పేర్కొంది ఎన్నికల కమిషన్‌.. దీంతో.. జనసేన పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో ఆ పార్టీకి కాస్త ఊరట లభించినట్టు అయింది. మిగిలిన చోట్ల మాత్రం గాజు గుర్తు కోరుకున్న అభ్య‌ర్ధుల‌కు కేటాయించామ‌ని తెలిపింది. గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఇలా చేస్తామని పేర్కొంది ఎన్నికల కమిషన్‌.. దీనితో.. జనసేన పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో ఆ పార్టీకి కాస్త ఊరట లభించినట్టు అయినా.. మిగతా స్థానాల్లో మాత్రం జనసేన ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ఇప్ప‌టికే గాజు గ్లాస్ గుర్తును 50మందికి పైగా స్వ‌తంత్ర అభ్య‌ర్ధుల‌కు కేటాయించారు. దీనిపై టీడీపీ-జనసేన కూటమి మరోసారి హైకోర్టుకు వెళ్లనుంది.

 

 

ఇవి కూడా చదవండి: