Jammu Kashmir: టెన్త్ టాపర్ గా ముగ్గురు పిల్లల తల్లి
జమ్ముకశ్మీర్‌కు చెందిన సబ్రినా ఖలిక్ ముగ్గురు పిల్లలకు తల్లైనా టెన్త్ టాపర్ గా నిలిచి వార్తల్లో కెక్కింది. సబ్రినా పెళ్లికి ముందు తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల పెళ్లి చేసుకుంది. కానీ పై చదువులు చదువాలన్న కోరిక మాత్రం ఆమె మనసులో అలాగే ఉండిపోయింది.
Srinagar: జమ్ముకశ్మీర్‌కు చెందిన సబ్రినా ఖలిక్ ముగ్గురు పిల్లలకు తల్లైనా టెన్త్ టాపర్ గా నిలిచి వార్తల్లో కెక్కింది. సబ్రినా పెళ్లికి ముందు తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల పెళ్లి చేసుకుంది. కానీ పై చదువులు చదువాలన్న కోరిక మాత్రం ఆమె మనసులో అలాగే ఉండిపోయింది.
దీనితో కుటుంబ బాధ్యతలు మోస్తూనే ప్రైవేటుగా పదో తరగతి చదవడం మొదలుపెట్టింది. ఇటీవల పదో తరగతి పరీక్ష రాయగా, వచ్చిన ఫలితాల్లో క్లాస్ టాపర్‌గా నిలిచింది. పరీక్షలో 93.4% మార్కులు సాధించింది. దీనిపై సబ్రినా ఖలిక్ సంతోషం వ్యక్తం చేసింది. భర్త, అక్కా చెల్లెళ్ల సహకారంతో అనుకున్నది సాధించానని అన్నారు.
కలలు కనడం మానొద్దని, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడాలని ఖలిక్ చెప్పింది. ఖలిక్ 500 మార్కులకు 467 మార్కులను సాధించగా, మాథ్స్, ఉర్దూ, సైన్స్ సోషల్ సబ్జెక్ట్ లలో A1 గ్రేడ్లు రావడం విశేషం.