Fighter Cock Auction: కరీంనగర్లో ఆసక్తికరంగా మారిన కోడిపుంజు వేలం కథ
కరీంనగర్లో ఓ కోడిపుంజు వేలం కథ ఆసక్తికరంగా మారింది. నాలుగు రోజులుగా కరీంనగర్ రెండో డిపోలో బందీగా ఉన్న కోడిపుంజును ఆర్టీసీ అధికారులు వేలం వేయనున్నారు. వరంగల్ నుంచి వేములవాడకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఎవరో కోడిపుంజును మర్చిపోయారు. దీనితో దీనిని వేలం వేయాలని నిర్ణయించారు.
Fighter Cock Auction: కరీంనగర్లో ఓ కోడిపుంజు వేలం కథ ఆసక్తికరంగా మారింది. నాలుగు రోజులుగా కరీంనగర్ రెండో డిపోలో బందీగా ఉన్న కోడిపుంజును ఆర్టీసీ అధికారులు వేలం వేయనున్నారు. వరంగల్ నుంచి వేములవాడకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఎవరో కోడిపుంజును మర్చిపోయారు. దీనితో దీనిని వేలం వేయాలని నిర్ణయించారు.
ఆ కోడిపుంజు నాదే..(Fighter Cock Auction)
నాలుగు రోజులకిందట వరంగల్ నుంచి వేములవాడ వెళ్లు బస్సులో ప్రయాణీకులు మరిచిపోయిన కోడిపుంజు డ్రైవర్ కంట పడింది. దీనితో అతను దానిని కరీంనగర్ డిపోలో అప్పగించారు. అప్పటినుంచి పుంజును అధికారులు సంరక్షిస్తున్నారు. పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు కోడిపుంజును బహిరంగ వేలం వేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కరీంనగర్రెండవ డిపో పరిధిలోని అంబేద్కర్ బస్టాండ్ ఆవరణలో వేలం ఉంటుందని ప్రకటించారు.అయితే తాజాగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన మహేశ్ అనే వ్యక్తి స్పందించాడు. తాను సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో మేస్త్రీ పని చేస్తుంటానని మహేశ వీడియో విడుదల చేశాడు. సొంతూరికి వస్తుండగా బస్సులో మరచిపోయానని మహేశ్ తెలిపాడు. తన కోడిని వేలం వేయవద్దని ఆర్టీసీ ఎండి సజ్జనార్‌ని మహేశ్ కోరాడు.