CM Revanth Reddy: ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు పత్రాన్ని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి అభయ హస్తం లోగోను విడుదల చేశారు. ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఆవిష్కరించారు.ఆరు పథకాలకు ఒకే దరఖాస్తు ఉంటుందని తెలిపారు. రేషన్ కార్డులు లేని వారికి కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అభయ హస్తం లోగోను విడుదల చేశారు. ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఆవిష్కరించారు.ఆరు పథకాలకు ఒకే దరఖాస్తు ఉంటుందని తెలిపారు. రేషన్ కార్డులు లేని వారికి కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు.
రేషన్ కార్డులు ఉంటేనే..( CM Revanth Reddy)
ప్రజా పాలన పేరిట విడుదల చేసిన ఈ దరఖాస్తు ద్వారా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తుందని చెప్పారు. టీఎస్పీఎసీ కొత్త పాలక మండలిని నియమిస్తామని, అనంతరం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు, ఫలితాలు ప్రకటిస్తామని అన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభలు నిర్వహించి దరఖాస్తుల స్వీకరణ తీసుకుంటామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ స్పష్టం చేసారు.ప్రభుత్వ సంక్షేమ పధకాలు పొందేందుకు ఒక దరఖాస్తును సమర్పిస్తే సరిపోతుంది. ప్రతీ మండలంలో రెండు గ్రూపులు ఏర్పాటు చేస్తామని ఒక గ్రూపుకు ఎఖండీఒ, మరో గ్రూపుకు ఎంపీడీవో ఉంటారని తెలిపారు. రేషన్ కార్డులు ఉంటేనే సంక్షేమ పధకాలకు అర్హులు అవుతారని చెప్పారు. జనవరి ఆరు తర్వాత కూడా ఎంపీడీవో, ఎమ్మార్వో ఆఫీసుల్లో దరఖాస్తులు అందజేయవచ్చని చెప్పారు. మేడిగడ్డకు సంబంధించి విచారణ జరుగుతోందని నివేదిక వచ్చాక ఎల్ అండ్ టీ అధికారుల పాత్ర తేలుతుందన్నారు. రైతు బంధుకు సంబంధించి ఎటువంటి పరిమితులు విధించలేదన్నారు. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- Daggubati Venkateswara Rao: ఎమ్మెల్యేగా ఓడిపోవడం మంచిదయింది.. మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
- Chennai: క్లాస్మేటే కాలయముడిగా మారి.. చెన్నైలో మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య.