Michaung Cyclone Effect: మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్.. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీలో మిచౌంగ్ తుఫాను మరో రెండు గంటల్లో బాపట్ల వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి సుమారు 110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాను కారణంగా ఏపీలోని 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. తుఫాన్ కారణంగా బాపట్ల తీరం అల్లకల్లోలంగా మారింది.
Michaung Cyclone Effect: ఏపీలో మిచౌంగ్ తుఫాను మరో రెండు గంటల్లో బాపట్ల వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి సుమారు 110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాను కారణంగా ఏపీలోని 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. తుఫాన్ కారణంగా బాపట్ల తీరం అల్లకల్లోలంగా మారింది.
మరోవైపు ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు చేతికొచ్చిన పంట నేలకొరిగింది. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. సీఎం కార్యాలయం నుంచి ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతంలోని ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని పునరావాస కేంద్రాలకు తరలించాయి. తుఫాన్ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపోర్లడంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగా.. నగరంలో నిన్నటి నుంచి విద్యుత్ నిలిచిపోయింది. తుఫాన్ ప్రభావంతో అరటి, నిమ్మ, బత్తాయి, బొప్పాయి వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొగల్తూరు మండలంలోని పేరుపాలెం, పిఎం లంక, చినమైనవానిలంక, తదితర గ్రామాలలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రాత్రి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
పొంగుతున్న వాగులు.. నేలకొరిగిన పంటలు..(Michaung Cyclone Effect)
భీమవరం, పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాల్లో గాలులు, వర్షం ధాటికి వరిచేలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోయింది. ఈరోజు మధ్యాహ్నం తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో తీవ్ర గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పల్లపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు సుకుంటున్నారు.తుఫాన్ నేపథ్యంలో రెండు రోజులపాటు స్కూళ్ళకి ఏలూరు జిల్లా కలెక్టర్ సెలవులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం కారణంగా గాలులు వర్షం ధాటికి వరిచేలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల కళ్ళాల్లో ధాన్యం తడిసిపోయింది.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరంలో తుఫాను ప్రభావంతో నిన్న రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మామిడికుదురు, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నిన్న రాత్రినుంచి కురుస్తున్న వర్షాలకు మండలంలోని వరిపంట నీటమునిగింది. 20 రోజుల్లో చేతికొచ్చే పంట నీటమునగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.కృష్ణా జిల్లా పామర్రులో తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా మొవ్వ-కొడాలి మధ్య రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విరిగిన చెట్లను తొలగించడానికి ఇంతవరకు అధికారులు చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు.అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో కుండపోతగా వర్షం కురుస్తోంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీటితో పంట పొలాలు నిండా మునిగాయి. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టులు నిండిపోవడంతో రహదారిపైకి వర్షపు నీరు చేరింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.తుపాన్ ప్రభావంతో దర్శి పరిసర ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తుంది. బలంగా వీస్తున్న గాలులకు పలు చోట్ల కరెంటు స్తంభాలు నెలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపడటంతో, విద్యుత్‌కు తీవ్ర అంతరాయం నెలకొంది. దర్శ పరిసర ప్రాంతాల్లోని చెరువులు నిండు కుండను తలిపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలన్ని పూర్తిగా దెబ్బతిన్నాయి.