Mansoor Ali Khan : నటి త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీఖాన్.. ఇక ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అంటూ !
తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లియో సినిమాలో తన క్యారెక్టర్ గురించి, త్రిష గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆయన ఇంటర్వ్యూలో చాలా సినిమాల్లో విలన్ గా చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ చేశాను. లియో సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినప్పుడు త్రిషతో రేప్ సీన్
Mansoor Ali Khan : తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లియో సినిమాలో తన క్యారెక్టర్ గురించి, త్రిష గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆయన ఇంటర్వ్యూలో చాలా సినిమాల్లో విలన్ గా చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ చేశాను. లియో సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినప్పుడు త్రిషతో రేప్ సీన్ ఉంటుంది అనుకున్నాను. కానీ లేనందుకు బాధపడ్డాను అని వ్యాఖ్యలు చేయడంతో ఇవి సంచలనంగా మారాయి. లియో షూటింగ్ కశ్మీర్ షెడ్యూల్లో త్రిషను కనీసం ఒక్కసారి కూడా తనకు చూపించలేదని వాపోయాడు. అయితే మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అతన్ని బ్యాన్ చేయాలనీ, అతన్ని అరెస్ట్ చేయాలనీ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ చేశారు.
మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై త్రిష కూడా తీవ్రంగా స్పందిస్తూ.. ఆ వ్యాఖ్యలని ఖండించి, చాలా అసహ్యంగా మాట్లాడిన వ్యక్తితో నటించనందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఇకపై నటించను అని కామెంట్స్ చేసింది. త్రిషకి సపోర్ట్ గా లియో దర్శకుడు లోకేష్ కానగరాజ్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, మాళవిక, చిన్మయి, నితిన్, చిరంజీవి.. ఇలా చాలా మంది ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు ట్వీట్స్ చేస్తూ మన్సూర్ పై విమర్శలు చేశారు. అటు జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ విషయంపై స్పందించి చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు డీజీపీకి స్పష్టం చేసింది.
దీనిపై మన్సూర్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి.. నేను అన్న వ్యాఖ్యలను తప్పుగా ప్రమోట్ చేశారు. సినిమాల్లో నిజంగానే రేప్ చేస్తారా? సీన్స్ ఎలా షూట్ చేస్తారో తెలీదా? నేను త్రిషకు క్షమాపణలు చెప్పను. నేనేం తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. నా మీద ఇప్పటికే చాలా మంది సినిమా వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేశారు. నా మీద కామెంట్స్ చేసేవాళ్లంతా మంచోళ్ళా? నేను త్రిషపై పరువు నష్టం కేసు వేస్తాను. నడిగర్ సంఘం నా వైపు వివరణ వినకుండా, వినే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నాకు (Mansoor Ali Khan) ఎందుకు నోటీసులిచ్చింది అని అన్నాడు.
కానీ తాజాగా మన్సూర్ అలీఖాన్ తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపాడు. త్రిష తన సహ నటి అని, ఆమెకు క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించాడు. త్రిష పట్ల తనకు గౌరవం ఉందని, తాను సరదాగా చేసిన వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ప్రచారం చేశారని తెలిపాడు. తాను ఎలాంటి వ్యక్తినో ఇండస్ట్రీలో అందరికీ తెలుసని మన్సూర్ అలీఖాన్ అన్నాడు. అలానే “చారిత్రక యుద్ధం ముగిసింది… ఇక ఎవరి పనులు వాళ్లు చూసుకోండి…. మీ తిట్లే నాకు దీవెనలు!” అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కూడా సెటైర్ వేసినట్లు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.