Weather Updates : మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..
తమిళనాడు మీదుగా పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాను ప్రభావంతో దక్షిణ భారతంలోని దక్షిణ ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇదే వాతావరణం కొనసాగితే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Weather Updates : తమిళనాడు మీదుగా పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాను ప్రభావంతో దక్షిణ భారతంలోని దక్షిణ ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇదే వాతావరణం కొనసాగితే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశముందని తెలుస్తుంది.
ఈ ప్రభావంతో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగానే వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది.
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్, పరిసర ప్రాంతాల్లో ఈ నెల 25న తుఫాన్ ఆవర్తనం చెందే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. ఈ ప్రభావంతో ఈ నెల 26 నాటికి ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని తెలిపారు. అనంతరం అది పశ్చిమ- వాయవ్య దిశగా ప్రయాణించి ఈశాన్య బంగాళాఖాతం, అండమాన్ పరిసరాల్లో ఈ నెల 27 నాటికి వాయుగుండంగా బలపడతుందన్నారు. తమిళనాడు, కేరళ పరిసరాల్లో సముద్రమట్టానికి 3.1 కి.మీ.ఎత్తులో మరో తుఫాన్ ఆవర్తనం కొనసాగుతోందన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రెండు, మూడు రోజుల తరువాత దీనిపై మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
నవంబర్ 23 గురువారం:
• కృష్ణా, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు (1/2) pic.twitter.com/ri4773rJvT
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 22, 2023
హైదరాబాద్లో గురువారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో పలుచోట్ల వర్షం కురుసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అమీర్ పేట్, బోయిన్పల్లి, మారేడ్పల్లి, బేగంపేట తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వర్గాలు సూచించారు.