Last Updated:

CM KCR Comments: కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిని తరిమి కొట్టాలి.. సీఎం కేసీఆర్

కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిని తరిమి కొట్టాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. బుధవారం కొడంగల్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన రేవంత్ రెడ్డిపై తీవ్రస్దాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీకి రూ.50 లక్షలు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తీరును గుర్తు చేశారు. జైలుకు వెళ్లినా రేవంత్ రెడ్డిలో మార్పు రాలేదని కేసీఆర్ అన్నారు.

CM  KCR Comments: కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిని తరిమి కొట్టాలి.. సీఎం కేసీఆర్

 CM KCR Comments: కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిని తరిమి కొట్టాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. బుధవారం కొడంగల్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన రేవంత్ రెడ్డిపై తీవ్రస్దాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీకి రూ.50 లక్షలు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తీరును గుర్తు చేశారు. జైలుకు వెళ్లినా రేవంత్ రెడ్డిలో మార్పు రాలేదని కేసీఆర్ అన్నారు.

అణా పైసా పనికూడా చేయలేదు..( CM KCR Comments)

రేవంత్ రెడ్డి పెద్ద భూ కబ్జాదారుడు. అతనికి నీతి లేదు, పద్ధతి, నియమం లేదు. కొడంగల్లో అణా పైసా పనికూడా చేయలేదన్నారు. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఎన్నో ఎకరాల భూములు లాక్కున్నారని అన్నారు. తప్పుడు వాగ్దానాలు చేసిన రేవంత్‌రెడ్డి కావాలా.. మాట నిలబెట్టుకున్న పట్నం నరేందర్‌రెడ్డి కావాలా? అని కేసీఆర్ ప్రశ్నించారు. నరేందర్ రెడ్డి వచ్చాకే కొడంగల్‌లో అభివృద్ధి జరిగిందన్నారు. దొంగ రేవంత్ రెడ్డి మాటలు విని మోసపోవద్దు . ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది.రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి నోరు తెరిస్తే గబ్బు .కాంగ్రెస్‌ నేతలకు కమిట్‌మెంట్‌ లేదని, డబ్బు సంపాదనపైనే వారికి ఆసక్తి ఉందని కేసీఆర్ అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పట్నం నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే కొడంగల్ గౌరవం పెరుగుతుందని అభివృద్ది జరుగుతుందని కేసీఆర్ అన్నారు.