CM Ys Jagan : వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేయనున్న సీఎం జగన్.. ఎప్పుడంటే ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలోని మాచర్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 15న ఆయన పర్యటన ఖరారు కాగా ఆరోజు వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ షెడ్యూల్ వివరాలు..
CM Ys Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలోని మాచర్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 15న ఆయన పర్యటన ఖరారు కాగా ఆరోజు వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ షెడ్యూల్ వివరాలు..
- వరికపూడిసెల ప్రాజెక్టుకు శంఖుస్థాపన కోసం ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు.
- అనంతరం మాచర్ల చెన్నకేశవ కాలనీ సభాస్ధలి వద్ద వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
- ఈ తరుణంలో మాచర్లలోని రాయవరం జంక్షన్ లో భారీ బహిరంగ సభకు వైకాపా శ్రేణులు ఏర్పాటు చేస్తున్నారు.
- సభలో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారని తెలుస్తుంది.
ఇక మరోవైపు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై టీడీపీ-జనసేన దృష్టి పెట్టాయి. అందులో భాగంగా ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మొదటి సమావేశం నేడు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ రాజమండ్రి వేదికగా సూపర్ సిక్స్ హామీలు ప్రకటించింది. మహిళల కోసం మహా శక్తి, రైతుల కోసం అన్నదాత, యువత కోసం యువ గళం, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇంటింటికీ మంచినీరు హామీలు ఇచ్చింది.
ఇక జనసేన కూడా నాలుగైదు ప్రతిపాదనలు ముందుకి తెచ్చింది. రైతులు, యువత, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడం, ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగం వంటి అంశాలను ముందుకు తెచ్చింది. రెండు పార్టీల ప్రతిపాదనలపై మేనిఫెస్టో కమిటీలో చర్చించనున్నారు. మేనిఫెస్టో రూపకల్పన కోసం రెండు పార్టీల నుంచి ముగ్గురేసి నాయకుల చొప్పున కమిటీ ఏర్పాటు చేశారు.