Chandra Mohan : నేడే సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ అంత్యక్రియలు.. ఎక్కడ ? ఎవరి చేతుల మీదుగా అంటే ??
Chandra Mohan :చంద్రమోహన్ తెలుగు, తమిళ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన నటుడు . వయోభారంతో గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్ ఇటీవల గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే
Chandra Mohan : చంద్రమోహన్ తెలుగు, తమిళ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన నటుడు . వయోభారంతో గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్ ఇటీవల గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే నవంబర్ 11న ఉదయం 9.45 గంటలకు మరణించారు.
చంద్రమోహన్ మరణంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. కొంతమంది ప్రముఖులు ఆయన ఇంటివద్దకు వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. గత రెండు రోజులుగా చంద్రమోహన్ భౌతికకాయాన్ని ఫిలిం నగర్ లోనే ఆయన ఇంటివద్ద పలువురి సందర్శనార్థం ఉంచారు.
చిన్న కూతురు మధుర మీనాక్షి అమెరికాలో ఉండటంతో ఆమె వచ్చేవరకు అంత్యక్రియలు ఆపారు. నేడు ఆవిడ హైదరాబాద్ కి రానుండటంతో ఇవాళ మధ్యాహ్నం చంద్రమోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి. చంద్రమోహన్ అంత్యక్రియలు మధ్యాహ్నం హైదరాబాద్ పంజాగుట్ట స్మశానంలో జరగనున్నట్టు సమాచారం. ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనకు కొడుకులు లేకపోవడంతో ఎవరి చేతుల మీదుగా ఈ అంత్యక్రియలు జరిపిస్తారారో అని చర్చించుకుంటున్నారు.
చంద్రమోహన్ కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న జన్మించారు. రచయిత్రి జలంధరను చంద్రమోహన్ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు మధుర మీనాక్షి, మాధవి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరపడ్డారు. రెండో కుమార్తె మాధవి కూడా డాక్టరే. ఆమె చెన్నైలో ఉంటున్నారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. డిగ్రీ వరకు చదువుకున్న చంద్రమోహన్ ఏలూరులో బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌కి ఈయన చాలా దగ్గరి బంధువు. తమ్ముడి వరస అవుతారు.
మొత్తంగా దాదాపు 932 సినిమాల్లో చంద్రమోహన్ నటించారు. వీటిలో 175 సినిమాలు ఆయన హీరోగా చేశారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా ఐదు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. తెలుగు సినీ పరిశ్రమలో చెరిగిపోని ముద్ర వేశారు. రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సీతామాలక్ష్మి, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, చందమామ రావే, రామ్ రాబర్ట్ రహీమ్, సుఖ దుఃఖాలు, సిరిసిరి మువ్వ, కురుక్షేత్రం, శంకరాభరణం చిత్రాలతో బాగా ఫేమస్ అయ్యారు. కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి, జయసుధ, జయప్రద చంద్రమోహన్‌తోనే ఎక్కువ సినిమాలు చేశారు. కాగా, గోపీచంద్ హీరోగా నటించిన ‘ఆక్సిజన్’ సినిమాలో చివరిగా చంద్రమోహన్ కనిపించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ చంద్రమోహన్ సినిమాలు చేశారు.